1. ఇతరాలు
  2. »
  3. వంటకాలు
  4. »
  5. స్వీట్లు

కోవా కజ్జికాయలు

కోవా కజ్జికాయలు పాలు పంచదార బెల్లం ఎండుకొబ్బరి చిప్పలు
FileFILE
కావలసిన పదార్థాలు :
పాలు... ఒక లీటరు
పంచదార... అరకేజీ
బెల్లం... అరకేజీ
ఎండుకొబ్బరి చిప్పలు... నాలుగు
యాలకుల పొడి... అర టీస్పూన్

తయారీ విధానం :
పాలు మరగకాచి, చిక్కబడిన తరువాత పంచదార వేసి గరిటెతో కలుపుతూ దగ్గరగా వచ్చిన తరువాత యాలకుల పొడి వేయాలి. అది బాగా ఇగిరిన తరువాత రోట్లో వేసి నూరి కోవాలాగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి.

బెల్లం పాకంపట్టి, తురిమి ఉంచుకున్న ఎండుకొబ్బరిని అందులో వేసి మెల్లగా గట్టిపడేంతదాకా పొడి పొడిగా కలపాలి. ఆరిన తరువాత ఆ మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి.

ఒక్కొక్క ఉండను తీసుకుని దానిమీద పైన తయారు చేసి ఉంచుకున్న కోవాను పల్చగా రాసి పళ్ళెంలో పెట్టుకుని బాగా ఆరిన తరువాత పొడి డబ్బాలో నిల్వచేసుకుని వాడుకోవచ్చు. ఇవి తినడానికి చాలా రుచిగా ఉంటాయి.
About Writer
Ganesh
contractDetail: Webdunia Chennai.... మరింత చదవండి