1. ఇతరాలు
  2. »
  3. వంటకాలు
  4. »
  5. స్వీట్లు
  6. క్యారెట్ కేసరి బాత్

Carrot Kesari Baath | క్యారెట్ కేసరి బాత్

వంటకాలు స్వీట్లు క్యారెట్ కేసరి బాత్ బియ్యం పెసరపప్పు పంచదార నెయ్యి యాలక్కాయలపొడి జీడిపప్పు బాదంపప్పు
కావలసిన పదార్థాలు :
క్యారెట్ తురుము... ఒక కప్పు
బియ్యం... ఒక కప్పు
పెసరపప్పు... అర కప్పు
పంచదార... ఒక కప్పు
నెయ్యి... అర కప్పు
యాలక్కాయల పొడి... అర టీ.
జీడిపప్పు, బాదంపప్పు, కిస్‌మిస్‌లు... చెరో రెండు టీ.

తయారీ విధానం :
బియ్యం, పెసరపప్పు కలిపి తగినన్ని నీళ్లు పోసి సమంగా ఉడికించుకోవాలి. క్యారెట్ తురుమును నేతిలో వేయించి, ఉడికించుకున్న అన్నాన్ని కూడా ఇందులో వేసి కాసేపు వేయించాలి. ఆ తరువాత దానికి పంచదార కలిపి, పాకంలా వచ్చేవరకూ ఉంచి, యాలక్కాయల పొడి వేసి దించేయాలి.

చివర్లో నేతిలో వేయించిన బాదంపప్పు, జీడిపప్పులతో పైన అలంకరించాలి. అంతే క్యారెట్ కేసరి బాత్ రెడీ అయినట్లే..! మీరూ ట్రై చేస్తారు కదూ..!
About Writer
Ganesh
contractDetail: Webdunia Chennai.... మరింత చదవండి