చైన్ స్నాచింగ్‌కు పాల్పడుతున్న ప్రేమజంట.. హైస్పీడ్‌తో వచ్చి లాక్కెళ్తారు..?
Chain Snatching
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై నాలుగు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి దేవరకొండ డీసీపీ దర్యాప్తు చేస్తున్నారు. మర్రిగూడ మండల యారగండ్ల పల్లి గ్రామానికి చెందిన సాతూ సునీత మెడలో నాలుగు తులాల చైన్ లాక్కొని పారిపోయారని పోలీసుల విచారణలో తేలింది.
స్కూటీపై వచ్చిన ఈ జంట ఒంటరిగా వెళుతున్న మహిళల మెడల్లో నుంచి చైన్ ను లాగేసుకుటున్నారు. యవకుడు స్కూటీ నడుపుతుండగా, యువతి మాత్రం మహిళ మెడల్లో నుంచి చైన్‌లను తెంపుకుని పారిపోతున్నారు. ఈ జంట కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు.
