1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
  4. Blade, nails, tape: Doctors remove sharp objects from Chanchalguda prisoner's stomach

ఖైదీ కడుపులో మేకులు, టేపు చుట్టలు.. ఎక్స్‌రే చూసి షాక్

jail
కడుపు నొప్పితో బాధపడుతున్న ఖైదీకి ఆపరేషన్ చేసిన వైద్యులు షాకయ్యారు. చంచ‌ల్‌గూడ జైలులో ఖైదీ ఎండీ సొహైల్‌(21)ను క‌డుపు నొప్పితో విల‌విలాడుతుండ‌డంతో చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆసుప‌త్రికి తీసుక‌వ‌చ్చారు. అక్కడ అతనిని పరిశీలించిన వైద్యులు షాక్ అయ్యారు. 
 
పరీక్షించిన వైద్యులు అతని కడుపులో మేకులు, టేపు చుట్టలు ఇతర వస్తువులను చూసి ఖంగుతిన్నారు. జనరల్‌ సర్జరీ యూనిట్‌-7 వైద్యులు ఎక్స్‌రే తీసి పరిశీలించారు. రెండు మేకులు, షేవింగ్‌ బ్లేడు, ఇతర చిన్నపాటి వస్తువులు కడుపులో ఉన్నట్లు గుర్తించారు. 
 
గ్యాస్ట్రో ఎంటరాలజీ వైద్యులు బి.రమేశ్‌కుమార్‌ ఎండోస్కోపీతో విజయవంతంగా వాటిని బయటకు తీశారు. అతని ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉంది.
తర్వాతి కథనం
మూడు కేసుల్లో చంద్రబాబుకు ముందస్తు బెయిల్