గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By వరుణ్

మర్మాంగాన్ని కోసుకుని వైద్య విద్యార్థి ఆత్మహత్య.. ఎక్కడ?

Blade
హైదరాబాద్ నగరంలో దారుణం జరిగింది. మానసికస్థితి సరిగా లేని ఓ వైద్య విద్యార్థి బ్లేడుతో పురుషాంగాన్ని కోసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన హైదరాబాద్ జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది. 
 
పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు.. పాపిరెడ్డి నగర్ నివాసముంటున్న సామిరెడ్డికి భార్య, కుమార్తె, కుమారుడు కె.దీక్షిత్ రెడ్డి (20) ఉన్నారు. 12 ఏళ్ల కింద భార్యాభర్తల మధ్య గొడవలతో సామిరెడ్డి కుటుంబాన్ని వదిలేసి వెళ్లిపోయాడు. దీంతో తల్లి, కుమార్తె, కుమారుడు కలిసి ఉంటున్నారు. 
 
ప్రస్తుతం దీక్షిత్ గాంధీ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ రెండో సంవత్సరం విద్యాభ్యాసం చేస్తున్నాడు. అయితే ఇంటర్ నుంచే మానసిక సమస్యలతో బాధపడుతున్న అతడు.. కొద్దిరోజుల నుంచి తల్లితో గొడవపడి మందులు వేసుకోవడం మానేశాడు. 
 
ఈ నేపథ్యంలోనే ఆదివారం సాయంత్రం తల్లి, అక్క పనిమీద బయటకు వెళ్లడంతో దీక్షిత్ రెడ్డి బ్లేడుతో తన మర్మాంగాన్ని కోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో మృతి చెందాడు. బయట నుంచి వచ్చిన తల్లి, అక్క చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అక్కడికి చేరుకుని శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.