సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : గురువారం, 22 జూన్ 2023 (17:23 IST)

బెంగాల్‌లో పిడుగుపాటుకు 12 మంది మృత్యువాత

వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో పిడుగు పడి 12 మంది మృత్యువాతపడ్డారు. వీరిలో ముగ్గురు చిన్నారులు కూడా ఉన్నారు. బెంగాల్ రాష్ట్రంలోని మాల్దా జిల్లాలో పిడుగుపడి ముగ్గురు చిన్నారులతో సహా ఏడుగురు ప్రాణాలు కోల్పోయారని జిల్లా మేజిస్ట్రేట్ నితిన్ సింఘానియా తెలిపారు. మల్దాలోని బంగిటోలా హైస్కూలు సమీపంలో పాఠశాల వేళల్లో పిడుగుపడటంతో ఈ ఘోరం జరిగిందని తెలిపారు. మృతులంతా ఒక్కొక్కరు ఒక్కో ప్రాంతానికి చెందిన వారని ఆయన తెలిపారు. 
 
రానున్న 24 గంటల్లో కోల్‌కతాతో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. రానున్న 24 గంటల్లో అన్ని దక్షిణ జిల్లాలను రుతుపవనాలు ముంచెత్తుతాయని వెల్లడించింది. అలాగే, గత 48 గంటలుగా రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురిశాయి.