గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : గురువారం, 15 జూన్ 2023 (11:24 IST)

సుభాష్ చంద్రబోస్ ఎయిర్‌పోర్టులో భారీ అగ్నిప్రమాదం

fire accident
వెస్ట్ బెంగాల్ రాష్ట్ర రాజధాని కోల్‌కతాలోని సుభాష్ చంద్రబోస్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో బుధవారం రాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. విమానాశ్రయంలోని చెకిన్ ఏరియా పోర్టల్ డి విభాగంలో వద్ద ఈ మంటలు చెలరేగాయి. ఆ వెంటనే అప్రమత్తమైన అధికారులు వాటిని ఆర్పివేశారు. అయితే, పొగ దట్టంగా వ్యాపించడంతో చెకిన్ ప్రాసెస్‌ను కొంతసేవు నిలిపివేశారు. 
 
ఆ ప్రమాదంపై కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖామంత్రి జ్యోతిరాదిత్య సింథియా స్పందిస్తూ, చెకిన్ కౌంటర్ వద్ద దురదృష్టకర సంఘటన చోటు చేసుకుందన్నారు. అయితే, ఇది స్వల్ప అగ్నప్రమాదమేనని చెప్పారు. ఇదే విషయంపై తాను ఎయిర్‌పోర్టు డైరెక్టరుతో మాట్లాడినట్టు చెప్పారు. పరిస్థితి అదుపులోనే ఉందని చెప్పారని తెలిపారు. 
 
ప్రమాద స్థలం నుంచి ప్రయాణికులను సురక్షిత ప్రదేశానికి తరలించినట్టు చెప్పారు. ప్రమాదానికి గల కారణాలను ఏమిటో తెలుసుకుంటామని చెప్పారు. మరోవైపు, ఈ ప్రమాదం షార్ట్ సర్క్యూట్ కారణంగానే జరిగివుండొచ్చని భావిస్తున్నారు.