గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 15 మార్చి 2023 (08:55 IST)

అది పొట్టా - బ్లేడ్‌ల కొట్టా? యువకుడి కడుపులో 56 బ్లేడ్లు!

blades
రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన ఓ యువకుడి కడుపు బ్లేడ్ల కొట్టుగా మారింది. ఆ యవకుడి కడుపులో ఏకంగా 56 బ్లేడ్లు ఉన్నాయి. ఆ యువకుడికి రక్తపు వాంతులు కావడంతో ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు పరీక్ష చేయగా అతని కడుపులోని బ్లేడ్లను చూసి నిర్ఘాంతపోయారు. ఆ తర్వాత ఆపరేషన్ చేసి నిర్ఘాంతపోయారు. 
 
రాజస్థాన్ రాష్ట్రంలోని జాలోర్ జిల్లా సంచోర్ ప్రాంతానికి చెందిన యశ్‌పాల్ సింగ్ (26) అనే యువకుడు ఓ ప్రైవేటు సంస్థలో డెవలపర్‌గా పని చేస్తున్నాడు. మరో నలుగురు స్నేహితులతో కలిసి స్థానికంగా ఉండే బాలాజీ నగర్‌లో ఉంటున్నారు. ఆదివారం ఉదయం మిత్రులంతా తమతమ పనులకు వెళ్లిపోవడంతో యశ్‌పాల్ మాత్రమే గదిలో ఉన్నాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే అతనికి రక్తపు వాంతులు అయ్యాయి. దీంతో భయపడిపోయి తన మిత్రులకు ఫోన్ చేశాడు. వారు హుటాహుటిన గదికి వచ్చి యశ్‌పాల్‌ను ఆస్పత్రికి తరలించారు. ఆక్కడ వివిధ రకాల వైద్య పరీక్షలతో పాటు స్కానింగ్ వంటి పరీక్షలు చేయగా, కడపులోని బ్లేడ్లను చూసి వారు నిర్ఘాంత పోయారు.
 
బ్లేడుపై ఉన్న కవర్‌తోనే బాధితుడు బ్లేడ్లను మింగేయడంతో అతడికి నొప్పి కలగలేదని, అవి పొట్టలో చేరిన తర్వాత పేపర్ జీర్ణయం కావడంతో ఆ తర్వాత బ్లేడు తన ప్రతాపం చూపించడం మొదలుపెట్టిందని, ఈ కారణంగానే వాంతులు అయినట్టు వైద్యులు గుర్తించారు. పైగా, బ్లేడును తినడానికి ముందే వాటిని ముక్కలు చేసి ఆరగించాడని చెప్పాడు.