శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 8 ఫిబ్రవరి 2023 (15:29 IST)

బైకుపై లవర్స్ రొమాన్స్.. బైకుపై రెచ్చిపోయారు..

lovers
రాజస్థాన్‌లో ఓ వీడియో సోషల్ మీడియా వైరల్ మారటంతో పోలీసులు కేసు నమోదు చేశారు. బైకుపై లవర్స్ రొమాన్స్ ఘటనలు రోజు రోజుకీ పెరిగిపోతోంది. గతనెల జార్ఖండ్, లక్నోలో ఇలాంటివి జరగగా.. తాజాగా రాజస్థాన్‌లోనూ ఓ యువ జంట బైకుపై రెచ్చిపోయింది. 
 
రాత్రి వేళలో యువకుడు బైక్ నడుపుతుండగా, అతడి వైపు ముఖం వేసి ట్యాంక్‌పై అమ్మాయి కూర్చుంది. బైకు నడుపుతుండగానే ఇద్దరూ రొమాన్స్ చేశారు. అజ్మీర్‌లో సోమవారం ఇది జరగగా ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియా వైరల్‌గా మారాయి.
 
పోలీసులు సీసీటీవీ ఫుటేజీ ద్వారా వ్యక్తులు సాహిల్ మాస్సే (24), ఒక మహిళగా గుర్తించగలిగారు. విచారణ నిమిత్తం దంపతులను పోలీసులు అదుపులోకి తీసుకుని, ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.
 
బహిరంగ ప్రదేశాల్లో అసభ్యకరంగా ప్రవర్తించడం, ప్రాణాలకు ముప్పు కలిగించడం, నిర్లక్ష్యంగా ప్రవర్తించినందుకు పోలీసులు వారిపై కేసు నమోదు చేశారు.