ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : మంగళవారం, 24 జనవరి 2023 (16:39 IST)

రన్నింగ్ కారులో రొమాన్స్ - పోకిరీ జంట కోసం గాలింపు

romance
ఇటీవలి కాలంలో కొందరు పోకిరీ ప్రేమికులు వికృత చేష్టలకు పాల్పడుతున్నారు. బహిరంగ ప్రదేశాల్లో ఇష్టానుసారంగా రెచ్చిపోతున్నారు. ముఖ్యంగా, ద్విచక్రవాహనాలు, కార్ సన్ రూఫ్ విండోలలో నిలబడి ప్రయాణం చేస్తూ రొమాన్స్‌లో మునిగితేలుతున్నారు. ఇలాంటి వీడియోలు ఇపుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. 
 
తాజాగా, ఉత్తరప్రదేశ్ రాష్ట్ర రాజధాని లక్నోలో కారులో వెళ్తున్న ఓ జంట.. సన్ రూఫ్ విండోను ఓపెన్ చేసుకొని రొమాన్స్ చేసింది. బహిరంగంగా ఇలా చేయడంపై ప్రజల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. ఈ ఘటనపై స్పందించిన పోలీసులు.. కారు నంబర్ ప్లేట్ ఆధారంగా దర్యాప్తు జరుపుతామని తెలిపారు. ఈ జంటను గుర్తించి తగిన చర్యలు తీసుకుంటామని పోలీసులు చెబుతున్నారు.