శుక్రవారం, 3 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 19 నవంబరు 2022 (11:24 IST)

కొచ్చిలో 19ఏళ్ల మోడల్‌పై అత్యాచారం.. కారులో తిప్పుతూ..?

gang rape
కొచ్చిలో 19ఏళ్ల మోడల్‌పై అత్యాచారం చోటుచేసుకుంది. ఈ కేసులో ఒక మహిళతో మొత్తం నలుగురు ఎర్నాకుళం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. కొచ్చిన్ షిప్ యార్డ్ సమీపంలోని ఓ పబ్‌కు వెళ్లిన బాధిత మోడల్, అక్కడ మద్యం సేవించింది. రాత్రంతా పట్టణం చుట్టూ తిప్పుతూ ఆమెపై అత్యాచారం చేశారు. అనంతరం ఆమెను రూమ్ వద్ద వదిలి పెట్టి వెళ్లిపోయారు. 
 
బాధిత మోడల్‌ను చికిత్స కోసం కలమసెర్రి మెడికల్ హాస్పిటల్‌కు తరలించారు. ఆమెకు గాయాలైనట్టు సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. హాస్పిటల్ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఇది వెలుగు చూసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.