శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 11 నవంబరు 2022 (20:23 IST)

మోడలింగ్‌లో అవకాశాలు వచ్చినా.. పోలీస్ ఉద్యోగాన్ని వదలను..

Diana Ramirez
Diana Ramirez
కొలంబియాలో ఆమె పోలీస్ ఆఫీసర్. ఆమె మోడలింగ్ కూడా చేస్తోంది. ఆమె అందచందాలతో మోడలింగ్ కూడా చేస్తోంది. ఆమెకు ఇన్‌స్టాలో 4 లక్షల ఫాలోవర్లు ఉన్నారు. వివరాల్లోకి వెళితే, కొలంబియా పోలీస్ ఆఫీసర్ అయిన ఆమె పేరు డయానా రమిరెజ్.  
 
సోషల్ మీడియాలో డయానా రమిరెజ్ ఫొటోలు చూసినవారు ఆమె ఓ మోడల్ అని భావిస్తుంటారు. అయితే యూనిఫాంలో ఉన్న ఫొటోలు చూసిన తర్వాత ఆమె ఓ లేడీ పోలీసాఫీసర్ అనే విషయం అందరికీ తెలిసింది. దీంతో నెటిజన్లు సూపర్ మేడం అంటూ ప్రశంసలు గుప్పించారు. 
 
అంత అందగత్తె అయినప్పటికీ మోడలింగ్ రంగంలో అవకాశాలు వస్తున్నా.. వాటిని చేస్తూనే పోలీస్ ఆఫీసరుగా కొనసాగుతోంది. ఏ వృత్తిలో వున్నా.. పోలీస్ ఆఫీసర్ ఉద్యోగాన్ని వీడేది లేదని ఆమె స్పష్టం చేస్తోంది. 
 
కొలంబియాలోని మెడెలిన్ నగరం ప్రపంచంలోని అత్యంత ప్రమాదకర పరిస్థితులు ఉండే నగరాల్లో ఒకటి. అయినప్పటికీ, డయానా రమిరెజ్ పోలీసు ఉద్యోగాన్ని ఎంతో నిబద్ధతతో నిర్వహిస్తూ పోలీస్ శాఖలో మంచి గుర్తింపు తెచ్చుకుంది.