సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 22 అక్టోబరు 2022 (15:15 IST)

నిర్మానుష్య ప్రాంతంలో ప్రేమ జంట.. గంజాయి మత్తులో ఇద్దరు యువకులు?

love couple
ప్రేమ జంటపై గంజాయి మత్తులో వున్న ఇద్దరు యువకులు దాడి చేసిన ఘటన ఏపీలోని కృష్ణాజిల్లా ముస్తాబాద్‌లో చోటుచేసుకుంది. గంజాయి మత్తుతో తిరిగే బ్యాచ్ ప్రేమికులను టార్గెట్ చేసి దాడికి పాల్పడుతున్నాయి. తాజాగా గంజాయి మత్తుతో సైకోలా మారిన ఇద్దరు యువకులు.. ప్రేమ జంటపై దాడి చేశాయి. 
 
యువకుడిని బంధించి యువతిపై అత్యాచారయత్నానికి పాల్పడ్డారు. దీంతో సదరు యువతి కేకలు వేయడంలో నిందితులు పరారయ్యారు. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు వారిని వెంబడించగా, నిందితుల్లో ఒకరిని పట్టుబడగా, మరొకరు పరారయ్యాడు. నిందితులు వచ్చిన ఆటోను సైతం స్థానికులు స్వాధీనం చేసుకున్నారు. 
 
సదరు ప్రేమ జంట నిర్మానుష్య ప్రాంతానికి వెళ్తుండగా.. గమనించిన ఆ ఇద్దరు యువకులు ఆట్లోలో వారిని ఫాలో అయ్యారు. తర్వాత వారిపై దాడి చేసి వారి వద్దనున్న డబ్బులు సైతం లాక్కున్నారు. తర్వాత యువకుడిని తాళ్లతో బంధించి యువతిపై అత్యాచార యత్నానికి ప్రయత్నించారు. 
 
ఇంతలో అమె గట్టిగా కేకలు వేయడంతో అటు నుంచి వెళ్తున్న కొందరు స్థానికులు గమనించి వారిని రక్షించారు. యువతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. పరారీలో వున్న యువకుడి కోసం గాలిస్తున్నారు.