గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 28 జనవరి 2023 (11:16 IST)

జార్ఖండ్ అగ్నిప్రమాదం.. డాక్టర్ దంపతులతో పాటు ఆరుగురు మృతి

fire
జార్ఖండ్ ఆస్పత్రిలో ఏర్పడిన అగ్నిప్రమాదంలో డాక్టర్ దంపతులతో పాటు ఆరుగులు ప్రాణాలు కోల్పోయారు. వివరాల్లోకి వెళితే.. జార్ఖండ్ ధన్ బాద్ నగరంలో శుక్రవారం రాత్రి ఈ అగ్ని ప్రమాదం సంభవించింది. ధన్‌బాద్ నగరం పురానాబజార్‌లోని హాజ్రా ఆస్పత్రిలో శుక్రవారం రాత్రి అగ్నిప్రమాదం సంభవించింది. స్థానికులు ఆస్పత్రిలోని తొమ్మిది మందిని కాపాడారు. 
 
అగ్నికీలలతో పొగ కమ్ముకోవడంతో ఇద్దరు డాక్టర్లతో కలిసి మొత్తం ఆరుగురు మరణించారు. ఆసుపత్రిలో జరిగిన అగ్నిప్రమాదంలో డాక్టర్ వికాస్ హాజ్రా, అతని భార్య ప్రేమ హాజ్రా, ఇతర ఆసుపత్రి ఉద్యోగులు నలుగురు మరణించారు. ఆస్పత్రి రెండో అంతస్థులో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ అగ్నిప్రమాదం ఏర్పడిందని పోలీసులు తెలిపారు.