1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
  4. Massive fire Breaks out at deccan sports shop in secunderabad

నల్లగుట్ట డెక్కన్ స్పోర్ట్స్‌ షాపులో అగ్నిప్రమాదం

rtcbus catch fire
సికింద్రాబాద్‌లోని నల్లగుట్ట వద్ద గురువారం ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. నల్లగుట్టలోని డెక్కన్ స్పోర్ట్స్ షాపులో ఈ ప్రమాదం జరిగింది. షాపులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో షాపు మొత్తం కాలిపోయింది. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపకదళ సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను ఆర్పుతున్నారు. 
 
అయితే, ఈ మంటల్లో ముగ్గురు వ్యక్తులు చిక్కుకునివున్నట్టు వార్తలు వస్తున్నాయి. అలాగే, ఈ ప్రమాదానికి కారణం తెలియాల్సివుంది. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగివుంటుందని భావిస్తున్నారు. మరోవైపు, అగ్నిప్రమాదం కారణంగా ఆ మార్గంలో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. 
తర్వాతి కథనం
నేడు కర్నాటక - మహారాష్ట్రలలో ప్రధాని మోడీ పర్యటన