మంగళవారం, 16 జులై 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 29 సెప్టెంబరు 2022 (17:40 IST)

ధోనీని అధిగమించిన రోహిత్ శర్మ.. కేలండ‌ర్ ఇయ‌ర్‌లో 15 టీ20 విజ‌యాలు

rohith sharma
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ.. టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీని అధిగమించాడు. ఒక ఏడాదిలో టీమిండియాను అత్య‌ధిక టీ20 మ్యాచ్‌లలో గెలిపించిన కెప్టెన్‌గా రోహిత్ శ‌ర్మ నిలిచాడు. ఇప్ప‌టిదాకా ఈ రికార్డు మ‌హేంద్ర సింగ్ ధోనీ పేరిట ఉంది. ఈ రికార్డును హిట్ మ్యాన్ బ్రేక్ చేశాడు. 
 
దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌లో భాగంగా బుధ‌వారం జ‌రిగిన తొలి టీ20 మ్యాచ్‌లో టీమిండియా విజయం సాధించింది. ఇకపోతే... 2016లో ఒకే ఏడాదిలో 15 టీ20 మ్యాచ్‌లలో టీమిండియాను ధోనీ గెలిపించాడు. 
 
ఇటీవ‌లే ఆస్ట్రేలియాలో ముగిసిన టీ20 సిరీస్‌లో చివ‌రి మ్యాచ్‌లో టీమిండియాకు ద‌క్కిన విజ‌యం రోహిత్ శ‌ర్మ‌ను ఈ విష‌యంలో ధోనీ స‌ర‌స‌న చేర్చింది. ఆస్ట్రేలియాతో చివ‌రి మ్యాచ్‌లో విజ‌యంతో హిట్ మ్యాన్ ఖాతాలో కూడా కేలండ‌ర్ ఇయ‌ర్‌లో 15 టీ20 విజ‌యాలు న‌మోదయ్యాయి.