గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 31 అక్టోబరు 2022 (12:26 IST)

అలీతో సరదాగా.. పవన్ కల్యాణ్ భేటీ.. ఎప్పుడు?

Pawan Kalyan
అలీ జనసేన పార్టీలో కాకుండా వైసీపీ పార్టీలో చేరడంపై అప్పట్లో పవన్ కళ్యాణ్ విమర్శలు కూడా చేశాడు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్‌కి కౌంటర్‌గా అలీ కూడా రెస్పాన్స్ ఇచ్చారు. అప్పట్లో ఇది పెద్ద దుమారమే రేపింది. మళ్ళీ వీళ్లిద్దరు కలుస్తారా..? కలిసి సినిమాలు చేస్తారా అనే సందేహం అభిమానుల్లో ఉండేది.  
 
ఇప్పుడు లేటెస్ట్‌గా వినిపిస్తున్న మరో వార్త ఏమిటి అంటే అలీ యాంకర్‌గా ఈటీవీలో ప్రతి సోమవారం ప్రసారమయ్యే అలీతో సరదాగా ప్రోగ్రాంకి ముఖ్య అతిధిగా అతి త్వరలోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాబోతున్నాడని తెలుస్తుంది.
 
ఇటీవలే పవన్ కళ్యాణ్‌ని ప్రత్యేకంగా కలిసి అలీ అడగగా పవన్ కళ్యాణ్ పాజిటివ్‌గానే రెస్పాన్స్ ఇచ్చాడట. అలీతో సరదాగా చివరి ఎపిసోడ్‌కి పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ ప్రోగ్రామ్‌కు పవన్ కళ్యాణ్ రాకతో టీఆర్పీ రేటింగ్స్ పరంగా మరో లెవెల్‌కి వెళ్తుంది అనడం లో ఎలాంటి సందేహం లేదు.