శుక్రవారం, 3 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 30 అక్టోబరు 2022 (17:47 IST)

మంగళగిరిలో జనసేన పీఏసీ సమావేశం... కీలక తీర్మానాలు ఆమోదం

janasena
మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) సమావేశం ఆదివారం జరిగింది. ఈ సమావేశానికి ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కూడా హాజరయ్యారు. ఇందులో పలు తీర్మానాలు చేసి ఆమోదించారు. పవన్ కళ్యాణ్ విశాఖ పర్యటనను అడ్డుకునేందుకు పోలీసు, అధికార వ్యవస్థను దుర్వినియోగం చేసి భయానక వాతావరణం సృష్టించిన చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్టు చెప్పారు. 
 
కేంద్ర మంత్రి మురళీధరన్, టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు, సీపీఐ నారాయణ, సీపీఐ రామకృష్ణ, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పురంధేశ్వరి, బీజీపీ చీఫ్ సోము వీర్రాజు, లోక్‌సత్తా పార్టీ అధినేత జయప్రకాష్ నారాయణ్, బాబ్జిలు ఈ చర్యను ఖండించారని, వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ నేటి సమాజంలో తీర్మానం చేశారు. 
 
వైకాపా తొత్తులుగా మారిన పోలీసులు జనసేన పార్టీ కార్యకర్తలతో పాటు వీర మహిళలపై అక్రమ కేసులు పెట్టారని, వారి కుటుం సభ్యుల్లో మనోధైర్యాన్ని నింపిన పార్టీ అధినేత పవన్‌కు కృతజ్ఞతలు తెలియజేస్తూ మరోతీర్మానం చేశారు. అక్రమ కేసులను ఎదుర్కొంటున్న వారికి న్యాయపరమైన సహాయం అందించిన పార్టీ న్యాయ విభాగం సభ్యులను, న్యాయవాదులను అభినందిస్తూ తీర్మానం చేసినట్టు పేర్కొంది.