విడుదలకు సిద్ధమైన కిరణ్ అబ్బవరం వినరో భాగ్యము విష్ణుకథ చిత్రం
భలే భలే మగాడివోయ్, గీత గోవిందం, టాక్సీవాలా, ప్రతిరోజు పండగే, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ లాంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాలను నిర్మించిన GA2 పిక్చర్స్ లో రాబోతున్న మరో చిత్రం "వినరో భాగ్యము విష్ణుకథ"
రాజావారు రాణిగారు, ఎస్.ఆర్ కల్యాణమండపం, నేను మీకు బాగా కావాల్సినవాడిని వంటి చిత్రాలతో జనాదరణ పొందాడు కిరణ్ అబ్బవరం. హిట్, ఫ్లాపులతో సంబంధం లేకుండా ఈ యంగ్ హీరో వరుస సినిమాలకు పచ్చజెండా ఊపుతున్నాడు.ప్రస్తుతం కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram), కశ్మీర పరదేశి కాంబినేషన్‌లో వస్తున్న సినిమా వినరో భాగ్యము విష్ణుకథ (Vinaro Bhagyamu Vishnu Katha). షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 17న రిలీజ్ కు సిద్ధం చేస్తున్నారు.
ఈ చిత్రాన్ని జీఏ2 పిక్చర్స్ పతాకంపై బన్నీవాసు నిర్మిస్తుండగా..మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పిస్తున్నారు. మురళీ కిషోర్ అబ్బురూ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి చేతన్ భరద్వాజ్ సంగీతం సమకూర్చుతున్నాడు.
విలేజ్ డ్రామా నేపథ్యంలో సాగనున్న ఈ సినిమా ఫిబ్రవరి 17న విడుదలకానున్నట్లు అధికారిక ప్రకటన చేసారు చిత్రబృందం.