శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 14 సెప్టెంబరు 2022 (16:40 IST)

ప‌వ‌న్ క‌ళ్యాణ్ గారు నా సినిమా మెచ్చుకోవ‌డం ఎన‌ర్జీ ఇచ్చింది - కిరణ్ అబ్బవరం

Kiran Abbavaram
Kiran Abbavaram
హీరోగా సెటిల్ అవుతున్న టైంలో ఇలాంటి కథ నా కెరియర్ కు చాలా బూస్టప్ ఇస్తుంది. ఇందులో  రెండు సేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తున్నాను.అయితే ఇప్పటి వరకు రెండు షేడ్స్ ఉన్న పాత్ర  చేయడం ఇదే అవుతుంది. ఈ సినిమా ద్వారా అందరికీ మరింత దగ్గరవుతాను అనుకుంటున్నాను హీరోయిన్ కు కూడా మంచి ప్రాదాన్యత ఉన్న క్యారెక్టర్ దొరికింది.. అని కిరణ్ అబ్బవరం తెలియ‌జేశారు.
 
ఆయ‌న న‌టించిన కొత్త చిత్రం నేను మీకు బాగా కావాల్సినవాడిని. కోడి దివ్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ చిత్రం రూపొందింది. ఈ చిత్రాన్ని ఈ నెల 16న ఇండియా వైడ్ గా 550 పైచిలుకు థియేటర్స్ లలో రిలీజ్ చేస్తున్న సందర్బంగా చిత్ర హీరో కిరణ్ అబ్బవరం పాత్రికేయ మిత్రులతో  మాట్లాడారు.
 
- టైటిల్ పెద్ద‌దిగా వున్న‌ట్లు అనిపించినా.. ఇది కామ‌న్‌గా అంద‌రూ వాడే ప‌దం. ఎవ‌రిగురించి అయినా తెలిసిన‌ప్పుడు వీడు మ‌న‌కు బాగా కావాల్సినవాడు.. అంటుంటారు. అందుకే ఈ సినిమా క‌థ‌కు యాప్ట్‌గా వుంటుంద‌ని నేను మీకు బాగా కావాల్సినవాడిని అని క‌థ‌ను బ‌ట్టే పెట్టాం.
 
- దర్శకుడు కోడి రామకృష్ణ గారు అంటే నాకు చాలా ఇష్టం. ఆయన సినిమాలు చూసి పెరిగాను .ఆయనతో పనిచేసే అవకాశం దొరకపోయినా తన కూతురు కోడి దివ్య దీప్తి గారితో పని చేయడం ఆనందంగా ఉంది.అలాగే నేను నటించిన ఈ సినిమా ట్రైలర్‌ ను పవన్ అన్న లాంచ్‌ చేయడం చాలా సంతోషంగా ఉంది. ఆయ‌న‌తో ఎక్కువ‌సేపు మాట్లాడ‌క‌పోయినా నా ఎస్‌.ఆర్‌. క‌ళ్యాణ‌మండ‌పం గురించి మాట్లాడుతూ, మంచి సినిమా చేశావ్ అని అన‌డం చాలా ఆనందంగా వుంది.
 
- మన అందరి ఇంట్లో జరిగే కథలా ఈ సినిమా  ఉంటుంది. కంప్లీట్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ తో తెరకెక్కిన ఈ సినిమాలో అండర్‌ కరెంట్‌గా ఒక ఇంపార్టెంట్‌ పాయింట్‌ని డిస్కస్‌ చేశాం. ఎస్వీ కృష్ణారెడ్డి గారి పాత్ర సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది . ఇందులోని తండ్రి కూతుళ్లు ఎమోషన్స్ కు ఆడియన్స్ కు బాగా కనెక్ట్ అవ్వడమే కాకుండా ఈసినిమాను చూసిన వారందరూ కచ్చితంగా ఎంజాయ్  చేస్తారు .
 
- దర్శకుడు  శ్రీధర్ నా కాంబినేషన్ లో సినిమా చేయడానికి  కొంతమంది ప్రయత్నించినప్పటికీ కోడి దివ్య గారి బ్యానర్ లో ఫైనల్ అవ్వడం చాలా సంతోషంగా ఉంది. అలాగే ఈ సినిమా కథ డిమాండ్ మేరకు డైలాగ్ వెర్షన్ నేనే రాశాను.ఇందులో నాది బాబా భాస్కర్ ల ట్రాక్ చాలా బాగుంటుంది.
 
కొత్త సినిమాలు
గీతా ఆర్ట్స్ లో "వినరో విష్ణు భాగ్యం", మైత్రి మూవీ మేకర్స్ లో  "మీటర్ " ఈ రెండు సినిమాలు షూటింగ్ పూర్తి చేసుకొన్నాయి. ఏ యం రత్నం బ్యానర్ లోని రూల్స్ రంజన్ సినిమా 40% షూటింగ్ అయ్యింది.ఇవి కాకుండా ఈ చిత్ర దర్శకుడు శ్రీధర్ గాదెతో త్వరలో మరో చిత్రం చేసే అవకాశం ఉంది అని ముగించారు