శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 13 సెప్టెంబరు 2022 (17:48 IST)

హ‌రిహ‌ర‌వీర‌మల్లులో అవ‌కాశం నా ల‌క్క్ - నిధి అగర్వాల్

Nidhi Aggarwal
Nidhi Aggarwal
నిధి అగర్వాల్ ఇటీవ‌ల జ‌రిగిన సైమా అవార్డు వేడుక‌లో సందడి చేసింది. అక్క‌డ ఏర్పాట్లు వ‌చ్చిన అతిథుల‌ను చూసి చాలా ఎడ్య‌కేట్ అయ్యాన‌ని చెబుతోంది. ప్ర‌ముఖులంద‌రినీ క‌ల‌వ‌డం క‌ల‌గా వుంది చెప్పింది. రామ్‌తో ఇస్మార్ట్ శంకర్ చిత్రంలో న‌టించిన ఆమె ద‌ర్శ‌కుడు పూరీ జ‌గ‌న్నాథ్ త‌న పాత్ర‌ను బాగా డిజైన్ చేశార‌ని చెప్పింది. హీరోకు స‌మాన‌స్థాయిలో వున్న ఆ పాత్ర త‌ర‌హా మ‌ర‌లా రాలేద‌ని చెబుతోంది. మున్నా మైఖేల్ మిస్టర్‌ మజ్ను చిత్రాల్లో న‌టించింది.
 
తాజాగా ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ సినిమాలో న‌టిస్తున్నాని చెబుతూ హ‌రిహ‌ర‌వీర‌మల్లు వంటి ప్ర‌తిష్టాత్మ‌క చిత్రంలో న‌టించ‌డం గ‌ర్వంగా వుంద‌ని పేర్కొంది. ఉద‌య‌నిధి స్టాలిన్ నిర్మాణంలో రూపొందుతోన్న ఈ సినిమా అన్ని బాష‌ల్లో విడుద‌ల‌కు సిద్ధం చేస్తున్నారు. ఇటువంటి సినిమాలో అవ‌కాశం రావ‌డం అదృష్టంగా భావిస్తున్న‌ట్లు చెబుతోంది.