గురువారం, 19 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 24 జూన్ 2022 (19:18 IST)

అంగరంగ వైభవంగా నిర్మాత సునీల్‌ నారంగ్‌ కుమార్తె జాన్వి నారంగ్‌ ఆదిత్యల వివాహం

bellomkonda family with Sunil Narang, Janvi Narang, Aditya
bellomkonda family with Sunil Narang, Janvi Narang, Aditya
ప్రముఖ నిర్మాత నారాయణ్ దాస్ కె నారంగ్ మనవరాలు, నిర్మాత సునీల్‌ నారంగ్‌ కుమార్తె జాన్వి నారంగ్‌ వివాహం హైదరాబాద్ హైటెక్స్ లో అంగరంగ వైభవంగా జరిగింది. కుటుంబసభ్యులు, బంధువుల సమక్షంలో వరుడు ఆదిత్యతో జాన్వి ఏడడుగులు వేశారు. అత్యంత కమనీయంగా జరిగిన ఈ పెళ్లి వేడుకల్లో పలువురు రాజకీయ నాయకులు, టాలీవుడ్‌ సినీ ప్రముఖులు పాల్గొన్నారు. 
 
Dilraju family
Dilraju family
మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్‌కల్యాణ్‌, నాగార్జున, గోపీచంద్, నాని, బెల్లం కొండ సాయి శ్రీనివాస్, అడవి శేష్, శివకార్తికేయన్, తేజా సజ్జా, సుప్రియ, సుశాంత్, దర్శకులు త్రివిక్రమ్ శ్రీనివాస్, హరీశ్‌ శంకర్‌, బోయపాటి శ్రీను, శేఖర్‌ కమ్ముల, ప్రశాంత్‌ వర్మ, అనుదీప్, నిర్మాతలు సురేశ్‌ బాబు, దిల్ రాజు, అభిషేక్‌ అగర్వాల్‌, అభిషేక్‌ నామా, బెల్లం కొండ సురేష్, మైత్రీ మూవీ మేకర్స్ రవి శంకర్, 14 రీల్స్ రామ్, సుధాకర్ రెడ్డి, ఠాగూర్ మధు, నాగవంశీ, మిర్యాల రవీందర్‌రెడ్డి, సి.కల్యాణ్‌, శ్రీనివాసా చిట్టూరి, పెన్ స్టూడియో అధినేత జయంత్ లాల్ గడ, మంత్రులు తలసాని శ్రీనివాస యాదవ్‌, హరీశ్‌ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్  తదితరులు పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు.