శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : గురువారం, 15 సెప్టెంబరు 2022 (17:57 IST)

సినిమా అంటే థియేటర్‌లో గోల పెట్టాలి , ఎంజాయ్ చెయ్యాలి - కిరణ్ అబ్బవరం

nenu meeku baga kavalsina vadini prerelease
nenu meeku baga kavalsina vadini prerelease
హీరో కిరణ్ అబ్బవరం న‌టించిన తాజా సినిమా  నేను మీకు బాగా కావాల్సినవాడిని. శ్రీధర్‌ గాదే దర్శకత్వం వహించారు.  సెప్టెంబర్ 16న ఈ చిత్రం విడుదలవుతుంది, ఇందులో భాగంగా చిత్ర యూనిట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది. ఈ ఈవెంట్ లో  దర్శకుడు ఎస్వీ. కృష్ణా రెడ్డి గారు మాట్లాడుతూ, ఈ సినిమాకి  శ్రీధర్ డైరెక్టర్ గా, కిరణ్ అబ్బవరం హీరోగా, అలానే నా కూతురులా నటించిన హీరోయిన్  చక్కగా చేసారు. వీళ్ళ పెరఫార్మన్స్ లు  అద్భుతంగా ఉన్నాయి. దీనికి ప్రధాన కారణం దివ్య దీప్తిగారు. ఆవిడ ఏ సమస్య ఎవరి ముందు పెట్టకుండా తనకుతానుగానే చేసుకుంటూ వెళ్లిపోయారు. దీనికి మూల కారణమైన వ్యక్తి కోడి రామకృష్ణ గారు, వాళ్ళ బ్యానర్ లో సినిమా  అంటే ఎగిరి గంతేసుకుని ఒప్పుకుంటాము. నేను అదే పనిచేసాను. ఈ సినిమాకి మణిశర్మ గారు అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు.  అద్భుతం క్రియేట్ చెయ్యడంలో మణిశర్మ గారు ఎప్పుడూ ముందే ఉంటారు. అని చెబుతూ ఈవెంట్ కి హాజరైన వాళ్ళకి నమస్కారాలు తెలిపారు.
 
చిత్ర దర్శకుడు శ్రీధర్ మాట్లాడుతూ, సెకండాఫ్ లో బాబా మాస్టర్, కిరణ్ భయ్యా మధ్యలో ఒక ఫన్ రైడ్ ఉంటుంది. ఈ సినిమాలో దానిని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లారు. నా రెండో సినిమానే మణిశర్మ గారితో చేయడం నా అదృష్టం అన్నారు.
 
హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మాట్లాడుతూ,  హీరో కిరణ్ అబ్బవరం ఎస్.ఆర్. కల్యాణ మండపం సినిమాతో అందరికి బాగా కావాల్సినవాడు అయిపోయారు, ఈ సినిమా ఘన విజయం సాధించి పెద్దరేంజ్ కి వెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 
 
హీరోయిన్ సంజన మాట్లాడుతూ.. ఇంత మంచి ప్రాజెక్ట్ తో తెలుగులో డెబ్యూ చేస్తానని ఉహించలేదు. ఇది మాస్ ఎంటెర్టైనమెంట్  సినిమా అయినా కూడా ఫిమేల్ కి మంచి ఇంపార్టెన్స్ ఇచ్చారు.  కృష్ణా రెడ్డి సర్ నన్ను రియల్ కూతురిలానే చూసుకున్నారు. 16న ఈ సినిమా చూడండి ఖచ్చితంగా ఈ సినిమా మీకు నచ్చుతుంది. 
 
నిర్మాత దివ్య దీప్తి మాట్లాడుతూ, నేను మణిశర్మ గారికి చాలా థాంక్ ఫుల్ ఉంటాను అండి. ఆయన మాకు ఇచ్చిన మ్యూజిక్, అలానే సినిమాకి ఇచ్చిన ఆర్.ఆర్ చాలా ఫాస్ట్ గా ఇచ్చారు. అలానే భాస్కర్ భట్ల గారికి, భాను మాస్టర్ కి మా టెక్నీషియన్స్ అందరికి చాలా థాంక్యూ అండి. మా డైరెక్టర్ శ్రీధర్ గారికి చాలా థాంక్స్ అండి. ఆయన ఏ సిచ్యువేషన్ అయినా ఫాస్ట్ గా హ్యాండిల్ చేసి  మాకు చాలా సపోర్ట్ చేసారు. ఈ సినిమాను కిరణ్ డైలాగ్స్ తో నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లారు. గ్యారంటీ గా ఒక మంచి కమర్షియల్ ఎంటెర్టైమెంట్ తో మీ ముందుకు వస్తున్నాం. కిరణ్ కి థాంక్స్ చెబితే అది చాలా చిన్న వర్డ్ అవుతుంది.అలానే మా  ఏలూరు శ్రీను గారికి, శ్యామ్ గారికి  చాలా థాంక్స్ అండి. ఇలానే మీ సపోర్ట్ ఉండాలని కోరుకుంటున్నాను.
 
హీరో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ, .సినిమా అంటే మనం థియేటర్ లోకి వెళ్లి గోల పెట్టాలి , ఎంజాయ్ చెయ్యాలి మీరెళ్ళి సినిమా మీకు నచ్చితే మీరు ఎంజాయ్ చెయ్యండి. మీకు నచ్చితేనే మీ ఫ్రెండ్స్ అందరికి చెప్పండి. అలానే ఈ వీక్ రిలీజ్ అవుతున్న "ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి" "శాకినీ డాకిని" సినిమాలు కూడా బాగా ఆడాలని కోరుకుంటున్నాను. కోడి రామకృష్ణ గారి బ్యానర్ లో ఫస్ట్ సినిమా చేయడం చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమాను ప్రొపెర్ గా ఎంజాయ్ చెయ్యండి. ఖచ్చితంగా నేను మీకు బాగా కావాల్సిన వాడిని చిత్రం మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. నన్ను అభిమానిస్తూ, నా వర్క్ ను ప్రోత్సహిస్తూ , నా భుజం తట్టేవాళ్ళకి ప్రతిఒక్కరికి థాంక్యూ సో మచ్.  సెప్టెంబర్ 16న "నేను మీకు బాగా కావాల్సిన వాడిని"  రిలీజ్ అవుతుంది సినిమా చూసి బాగా ఎంజాయ్ చెయ్యండి.అన్నారు.