శనివారం, 9 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : గురువారం, 7 జులై 2022 (17:20 IST)

నాన్న మాటలను గుర్తు పెట్టుకుంటాను - నిర్మాత కోడి దివ్య దీప్తి

Kodi Divya Deepti
Kodi Divya Deepti
ద‌ర్శ‌కుడిగా న‌టుడిగా తెలుగు ప్రేక్ష‌కుల హ్రుద‌యాల్లో శాశ్వ‌తంగా నిలిచిపోయిన శ‌తాధిక ద‌ర్శ‌కుడు కోడి రామ‌కృష్ణ‌ గారి పెద్ద కుమార్తె కోడి దివ్య దీప్తి నిర్మిస్తున్న కమర్సియల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్  "నేను మీకు బాగా కావాల్సినవాడిని".ఇద్దరి లైఫ్ మధ్యలో జరిగే ఇన్సిడెంట్స్ తో జరిగే ఈ కథలో వారిద్దరూ ఎక్కడ రియలైజ్ అవుతారనే సస్పెన్స్ తో ఈ చిత్రం తెరకెక్కుతుంది. కోడి దివ్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ పతాకంపై యంగ్ సెన్సేషన్ హీరో కిరణ్ అబ్బవరం,సంజ‌న ఆనంద్‌, సిధ్ధార్ద్ మీన‌న్‌, ఎస్వి కృష్ణారెడ్డి, బాబా బాస్క‌ర్‌, భరత్ రొంగలి నటీ నటులుగా యస్.ఆర్ కల్యాణ మండపం దర్శకుడు శ్రీధర్ గాదె దర్శకత్వంలో నిర్మిస్తున్న ఈ చిత్రానికి మెలోడీ బ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ అద్బుత‌మైన సంగీతాన్ని అందిస్తున్నారు. 
 
ఈ సినిమాలో కిరణ్ అబ్బ‌వ‌రం కొత్తగా కనిపించబోతున్నారు. ఈ చిత్రం నుంచి  విడుదలైన లాయర్ పాప.. లవ్ జైల్లో ఉన్న..బెయిల్ ఇచ్చి పోరాదే..అంటూ సాగే మాస్ బీట్ అందర్నీ ఆకట్టు కుంటుంది. పక్కా కమర్షియల్ పంథాలో సాగిపోయే ఈ పాటకు ప్రేక్షకులనుండి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం రెండు పాటలు మినహా షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ చిత్ర టీజర్ ను ఈ నెల 10 న విడుదల చేస్తున్నారు. జులై 8న చిత్ర నిర్మాత కోడి దివ్య దీప్తి బర్త్ డే సందర్బంగా ఆమె పాత్రికేయ మిత్రులతో మాట్లాడుతూ ప‌లు విష‌యాలు తెలియ‌జేశారు.
 
- నాకు డైరెక్షన్ చేయడమంటే చాలా ఇష్టం. నాన్న ద్వారా నేను దర్శకత్వంలో మెలుకువలు నేర్చుకున్నాను. అయితే నా వెడ్డింగ్ తరువాత మా వారు కూడా చెయ్యమని నన్ను ఎంకరేజ్ చేయడంతో చేద్దాం అనుకున్న టైంలో మా డాడీ హార్ట్ స్ట్రోక్ రావడం జరిగింది.అయితే తెలుగు ప్రేక్షకులతో మా నాన్న గారికి విడదీయరాని బంధం ఉంది.కేవలం దర్శకుడిగానే కాకుండా వ్యక్తిత్వం తోనూ ఎంతో మంది అభిమాను లను సంపాదించు కున్నారు. అటువంటిది నేను డైరెక్షన్ చేసి అయన పేరు చెడగొట్ట కూడదని బ్యాక్ స్టెప్ తీసుకున్నాను 
 
- మా నాన్నగారు తన శతాధిక చిత్రాలతో ప్రేక్షకులను రంజింప చేసి సినీ చరిత్రలో చిరస్మరణీయులుగా నిలిచిన దిగ్దర్శకులు. ఆయన సృష్టించిన చిత్రాలు ప్రేక్షకులను అలరిస్తూనే ఉంటాయి. ఆ స్పూర్తి తోనే పెద్ద కుమార్తెగా ఆయన అడుగు జాడలలో నడుస్తూ వారి దివ్యాసిస్సులతో ముందుకు వెళ్లాలని నిర్మాతగా మారి కోడి దివ్య ఎంట‌ర్‌ టైన్‌మెంట్స్ పతాకంపై యంగ్ సెన్సేషన్ హీరో కిరణ్ అబ్బవరంతో "నేను మీకు బాగా కావాల్సినవాడిని" చిత్రం చేస్తున్నాను. 
 
- మా నాన్నగారు ఉన్నపుడే నేను కిరణ్ గారితో చేద్దాం అని కథలు విన్నాను అయితే అప్పుడు కుదరలేదు.దాంతో తను యస్. ఆర్. కల్యాణమండపం సినిమాకు మూవ్ అవ్వడం జరిగింది. ఆ సినిమా పెద్ద హిట్ అవ్వడం జరిగింది.ఆ తరువాత మేము ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాము. మా నాన్న గారు మాతో ఎప్పుడూ చెప్పేవారు మనం పెట్టె ప్రతి రూపాయి స్క్రీన్ పై కనపడేలా చెయ్యాలి తప్ప వెస్టేజ్ మాత్రం చెయ్యకూడదు అనేవారు.దాన్ని మనసులో పెట్టుకొని ఈ సినిమా చేస్తున్నాను 
 
- ఇద్దరి లైఫ్ మధ్యలో జరిగే ఇన్సిడెంట్స్ తో జరిగే ఈ కథలో వారిద్దరూ ఎక్కడ రియలైజ్ అవుతారనే సస్పెన్స్ తో ఈ సినిమా ఉంటుంది.ఈ సినిమాకు మెయిన్ టర్నింగ్ పాయింట్స్ బాగా సెట్ అయ్యాయి. సాంగ్స్ చాలా బాగా వచ్చాయి. ప్రేక్షకులకు ఎంటర్ టైన్ అయ్యే అన్ని అంశాలు ఇందులో ఉన్నాయి. హీరోయిన్ కు ఫాదర్ గా యస్. వి. కృష్ణా రెడ్డి గారు యాక్ట్ చేస్తున్నారు.అలాగే బాబా భాస్కర్ ఇలా చాలామంది నటీ నటులు, టెక్నిషియన్స్ అందరూ బాగా సెట్ అయ్యారు. ఈ సినిమాకు మెలోడీ బ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ గారు మ్యూజిక్ చేయడం చాలా సంతోషం.వైజాగ్ లో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం  ఇప్పుడు జరిగే సాంగ్ తో షూటింగ్ పూర్తవుతుంది.
 
- మా నాన్న గారికి రియాలిస్టిక్ గా ఉండే సబ్జెక్టుతో కొత్తవారితో తక్కువ బడ్జెట్ లో మంచి క్వాలిటీ సినిమా తీయాలనే కోరిక ఉండేది అది అవ్వలేదు. నాకు కమర్సియల్ ఎంటర్ టైనర్ సినిమాలు తీయడం అంటే ఇష్టం.ఈ మధ్య ఆడియన్స్ ను థియేటర్స్ రప్పించాలి అంటే చాలా కష్టపడాలి.
 
- దర్శకులు నాకు చెప్పే కథ విన్నప్పుడు ఏ జానర్ అయినా కానీ వారు చెప్పిన కథ ప్రేక్షకులకు ఎంతవరకు రీచ్ అవుతుంది. దాంట్లో ఉన్న ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఏంటి, ప్రేక్షకులు ఏ పాయింట్ కొరకు చివరి వరకు వెయిట్ చేస్తారు అనే పాయింట్ చూసుకొని మొదట నేను ఆ పాయింట్ కు రియాక్ట్ అయితే అప్పుడు ప్రేక్షకులు కూడా రియాక్ట్ అవుతారని నమ్మి  సినిమా చేయడానికి ముందుకు వస్తాను.
 
- దర్శకుడు శ్రీధర్ గాదె కు కిరణ్ కు బాగా ర్యాపో ఉంది. బేసిక్ గా  శ్రీధర్ ఎడిటర్. స్క్రీన్ ప్లే పరంగా ఎక్కడ పెడితే  ప్రేక్షకులు రియాక్టర్ అవుతారో అనే టైమ్ సెన్స్ తనకు బాగా తెలుసు.అలాగే తను తీసిన యస్. ఆర్ కల్యాణమండపం కూడా బిగ్ హిట్ అయ్యింది. తను మంచి కథలను సెలెక్ట్ చేసుకొని సినిమా చేస్తాడు.ఈ కథలో కూడా ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేసే అంశాలు చాలా ఉన్నాయి. రేపు
మేము ఈ సినిమా టీజర్ రిలీజ్ చేద్దాం అనుకున్నాము. అయితే మేము షూట్ లో బిజీగా ఉండడం వలన 10 వ తేదీన పాలకొల్లులో చిత్ర టీజర్ ను రిలీజ్ చేస్తున్నాము.
అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని సెప్టెంబర్ 9 న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాము.
 
- నా దగ్గర చాలా కథలు ఉన్నాయి. ఈ సినిమా తరువాత నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి అనేది తెలియజేస్తాను అని ముగించారు