మంగళవారం, 26 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : శుక్రవారం, 8 అక్టోబరు 2021 (17:16 IST)

ఘనంగా ప్రారంభమైన కోడిరామకృష్ణ కుమార్తె కొత్త చిత్రం

kodi divya, Kiran Abbavaram, Sanjana Anand, Karthik Shankar
కోడిరామకృష్ణ గారి ప్ర‌ధ‌మ కుమార్తి కోడి దివ్య దీప్తి  తన తండ్రి ఇచ్చిన స్పూర్తితో కొత్త చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కోడి రామకృష్ణ  స‌మ‌ర్ప‌ణ‌లో  కోడి దివ్య ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై కిరణ్ అబ్బవరం, సంజన ఆనంద్ జంటగా కార్తీక్ శంకర్ దర్శకత్వంలో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రం పూజ కార్యక్రమాలు శుక్ర‌వారం హైదరాబాదులోని అన్నపూర్ణ స్టూడియోలో సినీ అతిథుల సమక్షంలో ఘనంగా జరుపుకుంది. 
 
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా  సినిమాటోగ్రఫీ మినిస్టర్ తలసాని శ్రీనివాస్ యాదవ్, దర్శకేంద్రుడు కే. రాఘవేంద్ర రావు, నిర్మాతలు అల్లు అరవింద్, మురళి మోహన్, దర్శక, నిర్మాతలు యస్.వి.కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి, మ్యూజిక్ డైరెక్టర్ కోటి, రాజా రవీంద్ర తదితరులు పాల్గొని చిత్ర యూనిట్ కు శుభాకాంక్ష‌లు తెలిపారు. ముహూర్తపు సన్ని వేశానికి హీరో, హీరోయిన్ లపై నిర్మాత రామలింగేశ్వర రావు క్లాప్ నివ్వగా, ప్రముఖ నిర్మాత ఏ.ఎం. రత్నం స్విచ్ ఆన్ చేశారు, లెజెండరీ దర్శకుడు కె.రాఘవేంద్ర రావు గౌరవ దర్శకత్వం వహించారు.
 
Opening pooja
అనంతరం చిత్ర దర్శకుడు కార్తీక్ శంకర్ మాట్లాడుతూ, ఇది నా మొదటి చిత్రం. కోడి రామకృష్ణ గారి బ్యానర్లో దర్శకుడిగా పరిచయం అవుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి మంచి సినిమాకు దర్శకత్వం వహించే అవకాశం ఇచ్చిన కోడి దివ్య గారికి ధన్యవాదాలు తెలిపారు.
 
గీత ర‌చ‌యిత‌ భాస్కరపట్ల మాట్లాడుతూ, నేను కొడిరామకృష్ణ గారి డైరెక్షన్ లో రాయలేదు ఆ లోటు తనకుతూరు దివ్య తీస్తున్న ఈ సినిమా ద్వారా తీరుతుంది. మణి గారు మ్యూజిక్ ఇస్తున్నారు. అలాగే కిరణ్ అబ్బవరం తో యస్.ఆర్. కళ్యాణమండపం సినిమాకి ప‌ని చేశాను. మళ్లీ ఇప్పుడు పూర్తి స్థాయిలో చేస్తున్న సినిమా ఇది. సగం పాటలు పూర్తయ్యాయి. మీ అందరి దీవెన‌లు ఈ సినిమాకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను అన్నారు.
 
నిర్మాత కోడిదివ్య మాట్లాడుతూ, మంచి సినిమా తీయాలని మేము మా బ్యానర్లో తొలి అడుగు వేస్తున్నాము. మీ అందరి స‌హ‌కారం మాకు ఎల్లప్పుడూ ఇలాగే ఉండాలని మనస్పూర్తిగా కోరుతున్నాను అన్నారు.
 
చిత్ర హీరో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ, కోడి రామకృష్ణ గారి దీవెనలతో చాలా మంది పెద్దల ఆశీస్సులతో మా మూవీ స్టార్ట్ ఆయినందుకు ఈరోజు చాలా ఆనందంగా ఉంది. నాకు ఈ ప్రొడక్షన్ సొంత ప్రొడక్షన్ లాంటిది. మణిశర్మ మ్యూజిక్ అంటే నాకు చిన్నప్పటి నుంచి ఇష్టం `నరసింహ నాయుడు, ఇంద్ర` పాటలు విని థియేటర్ లో గోల చేసే వాడిని. ఇప్పుడు ఆయన నా సినిమాకు మ్యూజిక్  చేయడం చాలా సంతోషంగా ఉంది. భాస్కరభట్ల ప్రతి మూవీ ని ఒన్ చేసుకొని రాస్తాడు.ఈ సినిమాకు మంచి లిరిక్స్ ఇచ్చారు. రాజ్ గారితో సెబాస్టియన్ తరువాత చేస్తున్న రెండవ సినిమా ఇది. భరత్ అన్న ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా  చేస్తున్న తనతో ఇది నాలుగవ సినిమా. కార్తీక్ శంకర్ చాలా మంచి స్క్రిప్ట్ తో తీసుకొచ్చాడు. ఇది చక్కటి కుటుంబ కథా చిత్రం ఈ సినిమా ప్రతి ఒక్కరికీ కచ్చితంగా నచ్చుతుంది. స్క్రిప్ట్ వర్క్ చాలా బాగా వచ్చింది.ఈ నెలలోనే షూటింగ్ స్టార్ట్ అవుతుందని అన్నారు.
 
హీరోయిన్ సంజన ఆనంద్ మాట్లాడుతూ, నా మొదటి చిత్రం. ఇంత మంచి టీమ్ తో నటించే అవకాశం కల్పించిన నిర్మాత కోడి దివ్యకి ధన్యవాదాలు తెలిపారు.