సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : బుధవారం, 28 జులై 2021 (15:56 IST)

నా సెకండ్ ఇన్నింగ్స్ కి గుర్తింపు SR క‌ళ్యాణమండంపంః సాయికుమార్‌

Saikumar-kiran etc.
`నా సినీ జీవితాన్ని మ‌లుపు తిప్పిన సినిమాలు చాలా ఉన్నాయి. వాటిలో పోలీస్ స్టోరీ, ప్ర‌స్థానం చిత్రాలు నాకు ఓ ప్ర‌త్యేక‌మైన గుర్తింపును ఇచ్చాయి. నా యాభై ఏళ్ల సినీ జీవితంలో నేను ఇప్ప‌టి వ‌రుకు పోషించిన పాత్ర‌లు నా ఫ‌స్ట్ ఇన్నింగ్స్ కి వైభ‌వాన్ని తీసుకువ‌చ్చాయి. ఇక‌ నా సెకండ్ ఇన్నింగ్స్ కి అద్భుత‌మైన గుర్తింపును తీసుకొచ్చే సినిమాగా SR క‌ళ్యాణమండంపం EST 1975 అవ్వ‌డం ఖాయం. హీరో కిర‌ణ్ అబ్బ‌వరం చాలా ఫోక‌స్ డ్ గా ప‌నిచేస్తూ ఉంటాడు, ఈ సినిమాతో కిరణ్ మంచి పేరు, గుర్తింపు రావాల‌ని కోరుకుంటున్నాను, అలానే ప్రేక్ష‌కుల మా ఈ చిత్రాన్ని థియేట‌ర్స్ లో చూసి ప్రోత్స‌హించాల‌ని ప్రార్థిస్తున్నానని` డైలాగ్ కింగ్ సాయికుమార్ అన్నారు
 
`రాజావారు రాణిగారు` ఫేమ్ కిర‌ణ్ అబ్బ‌వ‌రం, టాక్సీవాలా ఫేమ్ ప్రియాంక జ‌వాల్క‌ర్ జంట‌గా న‌టించిన సినిమా ఇది. ప్ర‌మోద్,- రాజు నిర్మాత‌లు. శ్రీధ‌ర్ గాదే ద‌ర్శ‌కుడు. ఇటీవ‌లే విడుద‌ల చేసిన టీజ‌ర్ కి సైతం అంతటా అనూహ్య స్పంద‌న ల‌భించింది. ఆగ‌స్ట్ 6న‌ థియేట‌ర్ లో విడుద‌ల చేస్తున్నారు. చేత‌న్ భ‌ర‌ద్వాజ్ సంగీతం స‌మ‌కూర్చారు. కాగా, బుధ‌వారం మాదాపూర్ లో ఎ.ఎం.బి.మాల్‌లో ట్రైల‌ర్‌ విడుద‌లైంది. ఈ సంద‌ర్భంగా సాయికుమార్ ముఖ్యఅతిథిగా పాల్గొని పైవిధంగా స్పందించారు. 
 
అనంత‌రం హీరో కిర‌ణ్ మాట్లాడుతూ, నేనే క‌థ చెప్ప‌గానే న‌న్ను న‌మ్మిన ఎలైట్ ఎంట‌ర్ టైన్మెంట్స్ అధినేతలు ప్ర‌మోద్, రాజుల‌కు ఎల్ల‌ప్పుడూ రుణ‌ప‌డి ఉంటాను. వారి ప్రోత్సాహం లేక‌పోతే ఈ సినిమా ఇలా వ‌చ్చేది కాదు. అలానే ద‌ర్శ‌కుడు శ్రీధ‌ర్ ఈ సినిమా ఆద్యంతం అల‌రించే రీతిన తీర్చిదిద్దారు. మేమంతా చేసిన ఈ ప్ర‌య‌త్నాన్ని ఆగ‌స్ట్ 6న థియేట‌ర్ల‌కి వ‌చ్చి ప్రేక్ష‌కులు ప్రోత్స‌హిస్తార‌ని కోరుకుంటున్నాను అని అన్నారు. చిత్ర నిర్మాత‌లు, ద‌ర్శ‌కుడు మాట్లాడుతూ, మంచి సినిమాను థియేట‌ర్ల‌లోనే చూడండ‌ని పేర్కొన్నారు.