వినూతన్నంగా సెంటిమెంట్ కలగలిపిన సినిమా ప్రచారం
సినిమా తీయడం ఒక ఎత్తయితే, దానిని సరియైన సమయంలో విడుదల చేయడం మరో ఎత్తు. చాలామంది కొత్త నిర్మాతలు, హీరోలు స్వంత నిర్మాణ సంస్థను నెలకొల్పి సినిమాలు తీస్తున్నారు. ఒకనాడు సినిమా ప్రమోషన్ ప్లాంప్టెట్ నుంచి నేడే చూడండి అంటూ రిక్షాలో వీధి వీధి తిరుగుతూ మైక్‌లో అరుస్తూ ప్రేక్షకులకు తెలియజేసేవారు. అప్పట్లో టీవీలు, సోషల్ మీడియాలు అంటూ ఏమీలేవు. కానీ ఇప్పుడు మరలా సైకిల్ చక్రంలా ఆ రూటులోనే ప్రచారం సాగుతోంది. ఇటీవలే పూర్తిచేసుకున్న ఎస్.ఆర్. కళ్యాణమండపం సినిమా ప్రమోషన్‌ను చిత్ర టీమ్ పాత పద్ధతిలోనే పాంప్లెట్‌తోనే ప్రచారం చేస్తోంది. ఊరుల్లో రిక్షాలపై ప్రచారం చేస్తుంది.
ఇక సిటీకి వచ్చేసరికి బస్ వెనుక పోస్టర్లను అతికించడం, బస్టాండ్, రైల్వే స్టేషన్లలో ప్రోమోలు వేయడం మామూలే. కానీ సిటీబస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణీకులకు కరపత్రాలు ఇచ్చి తమ సినిమా చూడండి అంటూ ప్రచారం చేయడం ఆకర్షణగా వుంది. ఇక మెట్రో స్టేషన్‌లో కూడా రైలు ఆగగానే ఎక్కి అక్కడి పాసింజర్‌లను తమ సినిమా చూడండి. ప్రోత్సహించండి. కరోనా సెకండ్ వేవ్ తర్వాత ఓపెన్ అవుతున్న థియేటర్లలో మా సినిమా చూసి మీ ప్రేమ, ప్రోత్సాహం అందిస్తారని ఆశిస్తున్నాం అని విజ్ఞప్తి చేస్తున్నారు. మీరు ఇలా చేసే సహాయం 500 థియేటర్లలో యాజమాన్యానికి, సిబ్బందికి ఎంతో సహాయపడుతుందంటూ విన్నవిస్తున్నారు. సో. ఇదేరకమైన సెంటిమెంట్ ప్రచారం అన్నమాట.