బుధవారం, 4 అక్టోబరు 2023
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 19 జనవరి 2023 (13:24 IST)

నేడు కర్నాటక - మహారాష్ట్రలలో ప్రధాని మోడీ పర్యటన

modi
దేశంలో త్వరలోనే మూడు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ గురువారం రెండు రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా తొలుత ఆయన కర్నాటకలో పర్యటిస్తారు. ఆ తర్వాత మహారాష్ట్రకు వెళతారు. 
 
కర్నాటక రాష్ట్ర పర్యటనలో యాదగిరి, కలబురిగి జిల్లాలో ఆయన పర్యటిస్తారు. కొడెకలో సాగునీరు, తాగునీరు, జాతీయ రహదారి అభివృద్ధి ప్రాజెక్టులకు ఆయన శుంకుస్థాపనలు చేస్తారు. 560 గ్రామాల్లో మూడు లక్షల మంది రైతులకు లబ్ధి చేకూర్చేలా సాగునీటి ప్రాజెక్టుకు కూడా ఆయన శంకుస్థాపన చేస్తారు. 
 
అలాగే, సాయంత్రం మహారాష్ట్ర పర్యటనకు వెళతారు. ఛత్రపతి మహారాజ్ టెర్మినల్ పునరాభివృద్ధి పనులను ఆయన ప్రారంభిస్తారు. అలాగే, రూ.38800 కోట్ల వ్యయంతో చేపట్టే ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు చేస్తారు. ముంబై మెట్రోలో రెండు లైన్లను ఆయన ప్రారంభిస్తారు. ఈ మార్గాన్ని ఆయన జాతికి అంకితం చేస్తారు.