గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్

కర్నాటక ఎన్నికల్లో జేడీఎస్ తరపున సీఎం కేసీఆర్ ప్రచారం

kcrao
కర్నాటక అసెంబ్లీకి ఈ యేడాది ఎన్నికలు జరుగున్నాయి. ఈ ఎన్నికల్లో జనతాదళ్ సెక్యులర్ (జేడీఎస్) పార్టీ తరపున భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల ప్రచారం చేయనున్నారు. ఈ విషయాన్ని తెలంగాణ మంత్రి సత్యవతి రాథోడ్ వెల్లడించారు. 
 
తాజాగా కర్నాటకలోని కలబురిగిలో జేడీఎస్ ఆధ్వర్యంలో జరిగిన ఓ సమావేశానికి ఆమె హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, రాష్ట్రంలో త్వరలో అసెంబ్లీ ఎన్నికల్లో జేడీఎస్ తరపున సీఎం కేసీఆర్‌తో సహా తెలంగాణ మంత్రులందరూ ప్రచారం చేస్తారని చెప్పారు. 
 
అదేసమయంలో కర్నాటక అధికార పార్టీ బీజేపీపై ఆమె తీవ్ర విమర్శలు చేశారు. తమది డబుల్ ఇంజిన్ ప్రభుత్వమని గొప్పలు చెప్పుకునే బీజేపీ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో దారుణంగా విఫలమైందన్నారు. తెలంగాణాలో తాము రూ.2016 చొప్పున పింఛన్ ఇస్తుంటే కర్నాటకలో మాత్రం ఇప్పటికీ రూ.600 మాత్రమే ఇస్తున్నారని గుర్తుచేశారు.