శుక్రవారం, 12 జులై 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 11 జనవరి 2023 (23:25 IST)

కాలిఫోర్నియాలో వరదలు 17మంది మృతి.. సర్వర్ డౌన్... విమానాలు..?

అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో భారీ వర్షాల కారణంగా 17 మంది మరణించారు. కొద్దిరోజులుగా అమెరికాలో మంచు తుఫాను తీవ్ర నష్టాన్ని కలిగించగా, ప్రస్తుతం కాలిఫోర్నియా రాష్ట్రంలో మునుపెన్నడూ లేని విధంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. 
 
అలాగే వరద ముంపు ప్రాంతాల నుంచి వేలాది మందిని ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వర్షాలు, వరదల కారణంగా 17 మంది చనిపోయారు.
 
మరోవైపు అకస్మాత్తుగా సర్వర్ వైఫల్యం కారణంగా యునైటెడ్ స్టేట్స్ అంతటా విమాన సేవలు నిలిచిపోయాయి. యునైటెడ్ స్టేట్స్ అంతటా 760 విమానాలు ఆలస్యంగా నడవగా, 90 విమానాలు రద్దు అయ్యాయి. 
 
సర్వర్‌లో సాంకేతిక లోపం కారణంగా యునైటెడ్ స్టేట్స్ అంతటా విమాన సేవలకు అంతరాయం ఏర్పడిందని, సర్వర్‌ను పరిష్కరించే వరకు విమాన సేవలను నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు.