1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated: శనివారం, 28 జనవరి 2023 (07:55 IST)

బెంగళూరు ఆస్పత్రిలో తారకరత్న..

Tarakaratna
టీడీపీ యువనేత నారా లోకేష్ 'యువగళం' పాదయాత్రలో పాల్గొని గుండెపోటుకు గురైన సినీనటుడు తారకరత్నను శుక్రవారం అర్థరాత్రి ప్రత్యేక అంబులెన్స్‌ ద్వారా బెంగళూరులోని నారాయణ ఆసుపత్రికి తరలించారు. అతని భార్య అలేఖ్యారెడ్డి- కుమార్తెలు ఆసుపత్రికి చేరుకున్నారు.  
 
ప్రస్తుతం బెంగళూరు ఆసుపత్రిలో వైద్య నిపుణుల సంరక్షణలో తారకరక్న వున్నారు. శుక్రవారం నారా లోకేష్ యువగళం పాదయాత్రలో తారకరత్నకు గుండెపోటు రావడంతో వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించిన సంగతి తెలిసిందే.