శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 27 జనవరి 2023 (18:55 IST)

నాకు చీరలు, గాజులు పంపిస్తే.. ఏం చేస్తానో తెలుసా? నారా లోకేష్

nara lokesh
శుక్రవారం కుప్పంలో ఏర్పాటు చేసిన యువ గళం సభలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రసంగించారు. మహిళా మంత్రి పేరు చెప్పకుండా లోకేష్ మాట్లాడుతూ.. నాకు చీరలు, గాజులు పంపిస్తానని ఓ మహిళా మంత్రి అన్నారు.
 
మహిళా మంత్రి రోజాను పరోక్షంగా ఉద్దేశించి నారా లోకేష్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. చీరలు, గాజులు తనకు పంపాలని మంత్రిని కోరిన లోకేష్, వాటిని తన సోదరీమణులకు ఇస్తానని, వారి కాళ్లకు నమస్కరించి గౌరవం ఇస్తానని ప్రకటించారు.
 
"మీ నాయకుడిలా అమ్మను, చెల్లిని అవమానించను" అని నారా లోకేశ్ అన్నారు. ఏపీ సీఎం జగన్ రెడ్డిని జాదూ రెడ్డి అని పిలిచి, ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఆడవాళ్ల సొమ్మును లాక్కున్నారని ఆరోపించారు.