ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 5 మార్చి 2023 (13:07 IST)

మామతో కోడలు ప్రేమ ... కోడలితో లేచిపోయిన మామ.. ఎక్కడ?

marriage
మానవ సంబంధాలు మంటగలిసిపోతున్నాయి. పలువురు వావివరుసలు మరచిపోతున్నారు. దీంతో అక్రమ ప్రేమల పేరుతో అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నారు. ఈ క్రమంలో ఓ కోడలు మమతో ప్రేమలోపడింది. ఆయన కూడా ప్రేమ మైకంలో కొడుకు భార్య అనే విషయాన్ని మరిచిపోయి పీకల్లోతు ప్రేమలో మునిగిపోయాడు. ఈ ప్రేమపిచ్చి ముదిరిపోవడంతో వారిద్దరూ లేచిపోయారు. ఈ ఘటన రాజస్థాన్ రాష్ట్రంలో జరిగింది. కట్టుకున్న భర్తకు భార్య, కొడుక్కి తండ్రి శఠగోపం పెట్టిపారిపోయాడు. ఈ వింత ఘటన వివరాలను పరిశీలిస్తే, 
 
రాష్ట్రంలోని బుండీ జిల్లాలోని సిలార్ గ్రామంలో పవన్ వైరాగీ అనే వ్యక్తి తన భార్య, తండ్రి రమేశ్ వైరాగీతో కలిసి నివశిస్తున్నాడు. పవన్ దంపతులకు ఆరు నెలల చిన్నపాప కూడా ఉంది. పని నిమిత్తం భర్తకు బయటకు వెళ్తే ఇంటిలోనే అతని తండ్రి బైరాగీ ఉండేవాడు. ఈ క్రమలో ఆయనకు ఆయనకు కోడలిపై, మామపై కోడలిపై ప్రేమ చిగురించింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో వారిద్దరూ ఏకాంతంగా గడపసాగారు. అయితే, తమ రాసలీలలు భరత్ అడ్డుగా ఉండటాన్ని పవన్ భార్య ఏమాత్రం నచ్చలేదు. ఈ క్రమంలో వారిద్దరూ కలిసి ఇంట్లో నుంచి పారిపోయాడు. 
 
ఈ విషయం తెలుసుకున్న పవన్ స్థానిక పోలీసులకు భార్య, తండ్రిపై ఫిర్యాదు చేశాడు. తన భార్య, తండ్రి ఇద్దరూ లేచిపోయారని తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. పైగా, తన భార్య అమాయకురాలని, ఆమెకు తన తండ్రి మాయమాటలు చెప్పి తన తండ్రే ఆమెను లేపుకెళ్లిపోయాడని పేర్కొన్నాడు. తన తండ్రి అనేక చట్ట వ్యతిరేక, పాడు పనులు చేస్తున్నాడని తెలిపారు. తన భార్యను లేపుకెళ్లడమే కాకుండా, తన ద్విచక్రవాహనాన్ని కూడా దొంగిలించాడని పవన్ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు.