1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
  4. RTC conductor pushes old woman from bus in sattenapalli

వృద్ధురాలిని బస్సులోంచి నెట్టేసిన కండెక్టర్

tsrtc vs apsrtc
ఆర్టీసీ బస్సు కండెక్టర్ దారుణంగా ప్రవర్తించాడు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిల్లో తాజాగా ఓ అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ కండెక్టర్ వృద్ధురాలిని బస్సులోంచి నెట్టేశాడు. త్వరగా బస్సు నుంచి దిగమంటూ ఆమెను మెట్లరై నుంచి కిందకు నెట్టాడు. ఈ ఘటనలో బాధితురాలికి స్వల్ప గాయాలైనాయి. 
 
సత్తెనపల్లి డిపో వద్ద వృద్ధురాలు బస్సులో నుంచి దిగుతున్న సమయంలో కండక్టర్ ఆమెను తొందరపెడుతూ బస్సులోంచి తోసేశాడని తెలిసింది. వృద్ధురాలు బోర్లాపడటంతో ఆమె ముఖానికి గాయాలయ్యాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.
About Writer
సెల్వి
తర్వాతి కథనం
జియో వరల్డ్ సెంటర్‌ కొత్త రికార్డు.. అతిపెద్ద ఎలివేటర్‌లలో...