శుక్రవారం, 14 నవంబరు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 6 సెప్టెంబరు 2025 (08:51 IST)

ఆ ఆరోపణలు ఎవరికి లబ్ధి చేకూర్చేందుకు చేశారో? హరీశ్ రావు

harish rao
ఇటీవల బీఆర్ఎస్ బహిష్క్రృత మహిళా నేత కె.కవిత తనపై చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి, భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్యే హరీశ్ రావు స్పందించారు. ఉద్యమం నుంచి 25 యేళ్లుగా తన ప్రస్థానం తెరిచిన పుస్తకమన్నారు. ఇటీవలికాలంలో నాపా పార్టీపై కొందరు ఆరోపణలు చేశారు. ఎందుకు చేశారో, ఎవరికి లబ్ధి చేకూర్చేందుకు చేశారో. నాపై చేసిన ఆరోపణలను వారి విజ్ఞతకే వదిలేస్తున్నారు. రాష్ట్రంలో ఓ వైపు రైతులు యూరియా కొరతతో ఇబ్బంది పడుతుంటే ఇలాంటి దిగజారుడు రాజకీయాలు మంచివి కావు. తెలంగాణ ప్రజలు ఆకాంక్షలు నెరవేర్చడే మా ముందున్న కర్తవ్యం అని హరీశ్ రావు అన్నారు. 
 
వైజాగా స్టీల్ ప్లాంట్‌కు ఎలాంటి ఢోకా లేదు : కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ 
 
విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను నష్టాల బారి నుంచి లాభాల బాట పట్టించేందుకు కొన్ని కఠిన నిర్ణయాలు అమలు చేస్తున్నామని, విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేట్ పరం కాదని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమలశాఖ సహాయమంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ తెలిపారు. స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ చేస్తారంటూ బాధ్యతారహిత పార్టీల నాయకులు అర్థంలేని ఆరోపణలు మానుకోవాలన్నారు.
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, కేంద్రం రూ.11,500 కోట్లు ఇచ్చింది నష్టాల్లో ఉన్న ప్లాంట్‌ను కాపాడేందుకే. స్టీల్‌ ప్లాంట్‌ భవిష్యత్‌ ప్రయోజనాలు కాపాడేందుకు ప్రభుత్వం తీసుకునే చర్యలకు అందరూ సహకరించాలి. ఉక్కు పరిశ్రమ భవిష్యత్తుకు ఎలాంటి ఢోకా లేదన్నారు. 
 
కార్మికులు, ట్రేడ్‌ యూనియన్‌ నాయకుల సహకారంతో ప్లాంట్‌ను లాభాల బాట పట్టిస్తాం. పరిశ్రమ ప్రయోజనాల కోసం కొన్ని కఠిన నిర్ణయాలు తప్పవు. జీఎస్టీ తగ్గిస్తూ తీసుకున్న సాహసోపేత నిర్ణయంతో విప్లవాత్మక మార్పులు వస్తాయి. సాధారణ ప్రజల జీవన స్థితిగతుల్లో సమూల మార్పులు రానున్నాయి. 
 
రెండు స్లాబ్‌లతో రానున్న రోజుల్లో మరింత వెసులుబాటు కలగనుంది. నరసాపురం పార్లమెంట్‌ నియోజకవర్గంలో రైల్వేలు, జాతీయరహదారులపై ప్రత్యేక దృష్టి సారించాం. 165వ జాతీయ రహదారి విస్తరణకు రూ.3,200 కోట్లతో డీపీఆర్‌ సిద్ధమైంది. త్వరలో నరసాపురం - చెన్నై వందే భారత్ రైలు ప్రారంభం కానుంది. నరసాపురం - అరుణాచలం ఎక్స్‌ప్రెస్‌ను రెగ్యులరైజ్ చేస్తాం. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఒకేచోట ఉండేలా కలెక్టరేట్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది’’ అని శ్రీనివాసవర్మ తెలిపారు.