సంబంధిత వార్తలు
- "ఫ్యూచర్ సిటీ" కోసం.. 30వేల ఎకరాల భూమిని సేకరించాలి: రేవంత్ రెడ్డి
- రేవంత్రెడ్డి హయాంలో ప్రజల శాపనార్థాలు తప్పట్లేదు.. కవిత ఫైర్
- రేవంత్ రెడ్డి "ఏఐ సిటీ"కి శంకుస్థాపన ఎప్పుడో తెలుసా?
- పిల్లలకు భోజనం పెట్టే ముందు రుచి చూడండి.. అంతే సంగతులు: రేవంత్ వార్నింగ్
- అదానీ ఇచ్చిన రూ. 100 కోట్లు విరాళం నిరాకరిస్తున్నాం: సీఎం రేవంత్ రెడ్డి
Padi Kaushik Reddy: నా దగ్గర డ్రగ్స్ పెట్టించి...? (video)
Case filed against BRS MLA Padi Kaushik Reddy: బీఆర్‌ఎస్ హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఆయనతో పాటు 20 బీఆర్‌ఎస్ నేతలపై సైతం కేసు నమోదైంది. విధులను ఆటంకం కలిగించడన్ని బెదిరింపులకు పాల్పడాన్నిఇన్‌స్పెక్టర్ రాఘవేంద్ర ఫిర్యాదు చేయగా.. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తన ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని కౌశిక్ రెడ్డి పోలీస్ స్టేషన్‌లో కంప్లైంట్ చేసేందుకు వెళ్లారు. ఆయన వచ్చే సమయానికి సీఐ బయటకు వెళ్తున్నారు. అయితే తన ఫిర్యాదును స్వీకరించిన తర్వాత వెళ్లాలని కౌశిక్ రెడ్డి కోరారు. తాను ఓ స్నేహితుడి పార్టీకి వెళితే శివధర్ రెడ్డి ఫోన్ ట్యాప్ చేసి.. అక్కడికి పోలీసులను పంపారని.. నా దగ్గర డ్రగ్స్ పెట్టించి కేసు పెట్టించాలని శివధర్ రెడ్డి ప్రయత్నించారన్నారు. సీఎం రేవంత్, శివధర్రెడ్డిపై కేసు నమోదు చేయాల్సిందేనని ఆయన డిమాండ్ కౌశిక్ రెడ్డి చేశారు.
తాను ఎమ్మెల్యే అనే గౌరవం లేకుండా సీఐ ప్రవర్తించారని.. డీజీపీ కన్నా ఎక్కువ ప్రోటోకాల్ ఎమ్మెల్యేకు ఉంటుందని సీఐకి ఉంటుందని.. పదవులు లేని సీఎం సోదరులకు పోలీసులు వంగి వంగి దండాలు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇంటికి భారీగా చేరుకున్న పోలీసులు
— Telugu Scribe (@TeluguScribe) December 5, 2024
ఏ క్షణంలోనైనా కౌశిక్ రెడ్డిని అరెస్టు చేసే అవకాశం
మరి కాసేపట్లో కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్లనున్న మాజీ మంత్రి హరీష్ రావు, గ్రేటర్ హైదరాబాద్ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు https://t.co/96UMm6oJ8R pic.twitter.com/LeLLfdk2LP
