1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
  4. Chicken prices down in Telangana

తెలంగాణలో గణనీయంగా పడిపోయిన చికెన్ అమ్మకాలు

Chicken prices down in Telangana
తెలంగాణ వ్యాప్తంగా చికెన్ అమ్మకాలు గణనీయంగా పడిపోయాయి ఇదే పరిస్థితి కొనసాగితే మరొక రెండు మూడు రోజుల్లో చికెన్ షాపులు తెలంగాణ వ్యాప్తంగా మూతపడే అవకాశాలు ఉన్నాయని పౌల్ట్రీ వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. ఇందుకు కారణం బర్డ్ ఫ్లూనే. ఒక్కసారిగా చికెన్ పట్ల ప్రజలు ఇంత భయపడడం బర్డ్ ఫ్లూ కారణమని అంటున్నారు వ్యాపారస్తులు. అయితే ఏపీలో ఉన్న బర్డ్స్ లు తెలంగాణలో లేదని ఎవరు ఆందోళన చెందనవసరం లేదని వ్యాపారస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు. 
 
మరోవైపు ఏపీలో బోర్డ్ ఫ్లూ విస్తృతంగా వ్యాప్తి చెందుతుంది ఇప్పటికే ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టినప్పటికీ కూడా చాలా ప్రాంతాల్లో చికెన్ అమ్మకాలు నిలిపివేశారు. ముఖ్యంగా నెల్లూరు ఒంగోలు విజయవాడ గుంటూరు లాంటి ప్రాంతాల్లో బర్డ్ ఫ్లూ ప్రభావం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఈ ప్రాంతాల్లో చికెన్ తినాలంటేనే నగరవాసులు బెంబేలెత్తిపోతున్నారు.
తర్వాతి కథనం
మాదాపూర్‌లో ‘స్వాద్ ఆఫ్ సౌత్’ అవుట్‌లెట్, దక్షిణ భారత శాఖాహార వంటకాల రుచులు