మాదాపూర్‌లో ‘స్వాద్ ఆఫ్ సౌత్’ అవుట్‌లెట్, దక్షిణ భారత శాఖాహార వంటకాల రుచులు
స్వచ్ఛమైన శాఖాహార దక్షిణ భారతీయ వంటకాలకు పర్యాయపదంగా నిలిచిన స్వాద్ ఆఫ్ సౌత్, హైదరాబాద్‌లోని అత్యంత ఉత్సహపూరిత వాతావరణం కలిగిన మాదాపూర్‌లో తమ తాజా అవుట్‌లెట్‌ను ప్రారంభించినట్లు సగర్వంగా వెల్లడించింది. ఈ ఆవిష్కరణ దక్షిణ భారతదేశ రుచులను సుదూర ప్రాంతాలకు వ్యాప్తి చేయడంలో బ్రాండ్ యొక్క తిరుగులేని నిబద్ధతలో గణనీయమైన పురోగతిని సూచిస్తుంది.
ఆగస్ట్ 2022లో ప్రారంభమైనప్పటి నుండి, దక్షిణ భారత దేశపు వంటకాలలో మహోన్నత వంటకాల రుచులను పునః సృష్టించాలనే అపూర్వ ప్రయత్నం చేస్తూ, సంప్రదాయ ఆవిష్కరణల యొక్క సమ్మేళనంతో దక్షిణ భారత కలినరీ వైభవాన్ని పునర్నిర్మించాలనే అన్వేషణలో ఉంది స్వాద్ ఆఫ్ సౌత్. మాదాపూర్ అవుట్‌లెట్‌ను సందర్శించే భోజనాభిమానులు SOS స్పెషల్ కోకోనట్ షెల్ ఇడ్లీ, నెయ్యి పొడి తట్టే ఇడ్లీ, ఓపెన్ బట్టర్ మసాలా దోస, చెట్టినాడ్ పనీర్ మసాలా దోస, మలబార్ పరోటా విత్ కుర్మా, SOS స్పెషల్ హల్వా- అస్సలు వదలలేనట్టి మదురై జిగర్తాండ వంటి సిగ్నేచర్ డిష్‌ల కోసం ఎదురుచూడవచ్చు. హృదయపూర్వక శాకాహార విందుకు నిదర్శనం అయిన ఈ మెనూ, పరిశుభ్రత యొక్క అత్యున్నత ప్రమాణాలతో భోజనప్రియులు ఆకట్టుకునేలా తీర్చిదిద్దబడింది.
ఉడిపి-శైలి డెకార్ యొక్క స్ఫూర్తిని ప్రతిబింబించేలా చక్కగా రూపొందించబడిన స్వాద్ ఆఫ్ సౌత్, సంపన్నమైన ఇంకా సరసమైన వాతావరణం యొక్క విలక్షణమైన కలయికతో విభిన్నంగా ఉంటుంది. ఉడిపి యొక్క సాంస్కృతిక వారసత్వం యొక్క కాలాతీత గాంభీర్యం నుండి ప్రేరణ పొందిన ఈ అవుట్‌లెట్ యొక్క వాతావరణం సంప్రదాయం, ఆధునికత యొక్క అంశాలను సజావుగా మిళితం చేస్తుంది. సంక్లిష్టంగా చెక్కబడిన చెక్క నగిషీల నుండి డెక్కన్ ప్రకృతి దృశ్యాలను గుర్తుకు తెచ్చే శక్తివంతమైన రంగుల వరకు ఈ అవుట్‌లెట్ దక్షిణ భారతదేశంలోని గొప్ప కలినరీ నిధి ద్వారా ప్రయాణానికి అతిథులను ఆహ్వానిస్తుంది. కొత్త అవుట్‌లెట్ అతిథులను సాదరంగా స్వాగతిస్తుంది, దాదాపు 400 మంది కస్టమర్‌లకు వినూత్న అనుభవాలను అందించగల విశాలమైన ప్రాంగణాన్ని అందిస్తోంది, అందరికీ ఆనందకరమైన భోజన అనుభూతిని అందిస్తుంది.
"మా ప్రయాణం సంతోషకరంగా సాగింది. దక్షిణ భారత కలినరి వారసత్వం యొక్క స్ఫూర్తిని వేడుక జరుపుకునే అనుభవాన్ని రూపొందించడానికి మేము మా మనసా, వాచా కృషి చేసాము" అని స్వాద్ ఆఫ్ సౌత్ సహ వ్యవస్థాపకుడు రోనక్ సింఘి చెప్పారు. "మా మాదాపూర్ అవుట్‌లెట్ ప్రారంభంతో, స్వచ్ఛమైన శాఖాహార వంటకాలపై మా అభిరుచిని హైదరాబాద్‌లోని ఉత్సాహపూరిత కమ్యూనిటీ చెంతకు తీసుకురావడానికి మేము సంతోషిస్తున్నాము" అని అన్నారు.
"ఉత్సాహపూరిత వాతావరణం, విభిన్న జనాభాకు ప్రసిద్ధి చెందిన మాదాపూర్, మా కలినరి ప్రయాణాన్ని విస్తరించడానికి సరైన ప్రదేశంగా మాకు నిలుస్తుంది" అని స్వాద్ ఆఫ్ సౌత్ సహ వ్యవస్థాపకుడు కృష్ణ చౌదరి జోడించారు. "మేము ఈ ఉత్తేజకరమైన నూతన వెంచర్‌ను ప్రారంభించినప్పుడు, దక్షిణ భారత వంటకాల ఆనందాన్ని హైదరాబాద్‌లో, మరిన్ని ప్రాంతాలలో పంచుకునే అవకాశం గురించి మేము ఆసక్తిగా ఉన్నాము" అని అన్నారు.