మంగళవారం, 26 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 1 ఆగస్టు 2023 (12:16 IST)

నాట్యంతో సేవాకార్యక్రమాలు చేస్తున్న అభినయశ్రీ ఇంద్రాణి దావులూరి

Indrani Davuluri
Indrani Davuluri
ప్రముఖ నృత్యకారిణి, నటి అభినయశ్రీ ఇంద్రాణి దావులూరి ఒక నటీమణిగా, మోడల్ గా తనదైన ముద్ర వేశారు.  భారతదేశంలో అనేక ప్రకటనలతోపాటు ఫ్యాషన్ షోల్లో పాల్గొన్నారు. "అందెల రవమిది" అనే ఫీచర్ ఫిల్మ్‌లో ఇంద్రాణి నటించారు. ఈ చిత్రం ఆగస్టులో ఫిల్మ్ ఫెస్టివల్స్‌కు వెళ్లనుంది. అతి త్వరలో ఓటిటీ లోకి రానుంది. అంతేకాకుండా మిస్ తానా 2017,మిస్ గ్లోబల్ గ్లామరస్ ఫేస్, మిస్ ఫోటోజెనిక్, మిస్ టాలెంటెడ్, మిస్ సౌత్ ఏషియా వరల్డ్ ఎలైట్ వంటి అత్యున్నతమైన బిరుదులు ఆమెకు లభించాయి. 
 
కాగా, ఇటీవలే ఇంద్రాణి దావులూరి నృత్యం ఆకట్టుకుంది.  "అందెల రవమిది" పేరుతో మాధాపూర్ లోని శిల్పారామం యాంపీ థియేటర్ లో నృత్య రూపకాన్ని ప్రదర్శించారు. భరతనాట్య ప్రదర్శకురాలిగా ఇప్పటివరకు ఇంద్రాణి ఏడువందలకుపైగా ప్రదర్శనలు ఇచ్చారు. ఈ ప్రదర్శనలు ద్వారా వచ్చిన డబ్బును పలు సామాజిక సేవాకార్యక్రమాలు ఖర్చుచేస్తున్నారు ఆమె.  
 
 ఇంద్రాణి దావులూరి భరతనాట్య ప్రదర్శకురాలిగానే కాకుండా గురువుగా మారి "నాట్యమార్గం"పేరుతో భరతనాట్యం డ్యాన్స్ స్కూల్ ను ప్రారంభించారు.  ఆమె మైక్రోబయాలజీలో మాస్టర్స్ చేశారు. అంతేకాదు డాన్స్‌లో కూడా మాస్టర్స్ చేశారు. ఇంద్రాణి మద్రాస్ విశ్వవిద్యాలయం నుంచి ఉత్తీర్ణత సాధించారు. ఆమె అభిరుచి కారణంగా డ్యాన్స్‌ని కెరీర్‌గా ఎంచుకున్నారు.
 
నా బుక్ డ్యాన్స్ ఫిజియాలజీ, భరతనాట్యం డ్యాన్సర్‌లలో గాయం నివారణ 2023లో విడుదల కావలసి ఉంది,  
 
సనా పబ్లికేషన్స్ సంస్థ ఆమెకు నాట్యమయూరి బిరుదు ఇచ్చింది. ఢిల్లీ తెలుగు అకాడమీ ద్వారా ప్రతిభా పురస్కారంతోపాటు WHCF ద్వారా అత్యుత్తమ నాయకత్వ అవార్డు, మైడ్రీమ్ గ్లోబ్లాల్ ద్వారా అభినయ శ్రీ, క్యాపిటల్ ఏరియా తెలుగు అసోసియేషన్ ద్వారా ఉగాది పురస్కారం అందుకున్నారు ఇంద్రాణి. 
లెప్టోస్పిరోసిస్ వల్ల మహిళల్లో అంతర్గత గర్భాశయ మరణాలకు కారణమయ్యే ఇన్ఫెక్షన్లపై ఇంద్రాణి ఐవీఆర్ఐలో పనిచేశారు.