మాదాపూర్‌లో కారు ప్రమాదం.. ఇద్దరికి గాయాలు
మాదాపూర్‌లో జరిగిన కారు ప్రమాదంలో ఇద్దరు గాయాలకు గురైయ్యారు. శుక్రవారం రాత్రి మాదాపూర్‌లో ఓ కారు బీభత్సం సృష్టించింది. అత్యంత వేగంగా దూసుకొచ్చిన కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొని బోల్తాపడటంతో కారులో ఉన్న ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు కారులోని యువతీ యువకుడిని కాపాడారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వారిని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.