సోమవారం, 22 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : గురువారం, 4 మే 2023 (19:04 IST)

టీసీఎస్ కంపెనీకి బాంబు బెదిరింపులు.. చివరికి నిందితుడు ఎవరంటే?

TCS
TCS
హైదరాబాద్‌లోని మాదాపూర్‌లోని టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) కంపెనీకి బాంబు బెదిరింపులు వచ్చాయి. టీసీఎస్‌ కంపెనీకి బాంబు పెట్టినట్లు హెచ్చరిస్తూ యాజమాన్యానికి కాల్ రావడంతో కలకలం రేగింది. దీంతో యాజమాన్యం వెంటనే ఉద్యోగులందరినీ ఖాళీ చేయించి మాదాపూర్ పోలీసులకు సమాచారం అందించింది. 
 
పోలీసులు, బాంబ్ స్క్వాడ్ బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని ఆవరణలో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించగా ఎలాంటి బాంబు లభించలేదు. దీంతో ఉద్యోగులు హమ్మయ్య అంటూ ఊపిరి పీల్చుకున్నారు. 
 
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తులో భద్రతా విభాగంలో పనిచేసిన మాజీ ఉద్యోగి అనుమానితుడిని గుర్తించడం జరిగింది. నిందితుడే బాంబు బెదిరింపు కాల్ చేసినట్లు భావిస్తున్నారు. పోలీసులు అతని కోసం గాలింపు చర్యలు చేపట్టారు.