శుక్రవారం, 4 అక్టోబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వరుణ్
Last Updated : గురువారం, 4 మే 2023 (11:57 IST)

పెదనాన్న ఆరోగ్యం నిలకడగా వుంది : శరత్ బాబు సోదరుడి కుమారుడు

sarath babu
కొన్ని రోజుల క్రితం అనారోగ్యానికి గురైన ప్రముఖ నటుడు శరత్‌బాబు ఆరోగ్య పరిస్థితిపై ఆయన సోదరుడి కుమారుడు ఆయుష్‌ తేజస్‌ స్పందించారు. మా పెదనాన్న శరత్‌బాబు ఆరోగ్యం నిలకడగా ఉందని చెప్పారు. మునుపటి కంటే ఇప్పుడు కొంచెం కోలుకున్నారని తెలిపారు. అయితే, ఆయన పూర్తిగా కోలుకోవడానికి మరికొంత సమయం పడుతుందని డాక్టర్లు చెప్పినట్లు వెల్లడించారు. 
 
పైగా, సోషల్‌ మీడియాలో ఆయన చనిపోయారంటూ వచ్చే వార్తలను నమ్మొద్దని అభిమానులకు విజ్ఞప్తి చేశారు. శరత్‌బాబు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్న వారికి కృతజ్ఞతలు చెప్పారు. ఇక బుధవారం రాత్రి శరత్‌బాబు చనిపోయారంటూ కొన్ని వెబ్‌సైట్లలో వార్తలు వచ్చాయి. 
 
దీంతో కొందరు సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతూ సోషల్‌ మీడియాలో పోస్ట్‌లు పెట్టి తర్వాత వాటిని తొలగొంచారు. ఆయన సోదరి కూడా శరత్‌బాబు ఆరోగ్యంపై స్పష్టత ఇచ్చారు. ఆయన త్వరలోనే కోలుకుని మీడియాతో మాట్లాడతారని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.