శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : గురువారం, 27 ఏప్రియల్ 2023 (18:30 IST)

నరేష్ వికె, పవిత్ర లోకేష్ డాన్స్ చేసారు

Naresh VK and Pavitra
Naresh VK and Pavitra
డా.నరేష్ వికె పరిశ్రమలో 50 గోల్డెన్ ఇయర్స్ ని పూర్తి చేసుకున్నారు. నరేష్, పవిత్రా లోకేష్ కలిసి నటిస్తున్న గోల్డెన్ జూబ్లీ ప్రాజెక్ట్ తెలుగు-కన్నడ ద్విభాషా చిత్రం 'మళ్ళీ పెళ్లి'.  విలక్షణమైన కథతో పూర్తిస్థాయి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని మెగా మేకర్ ఎమ్‌ఎస్ రాజు రచన, దర్శకత్వం వహించగా, విజయ కృష్ణ మూవీస్ బ్యానర్‌పై నరేష్ స్వయంగా నిర్మిస్తున్నారు.
 
ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్, గ్లింప్స్, టీజర్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఈ రోజు మేకర్స్ ఈ చిత్రంలోని ఉరిమే కాలమా పాటని విడుదల చేశారు. కథలో కీలకమైన ఈ పాటని సురేష్ బొబ్బిలి హాంటింగ్ ట్యూన్ గా కంపోజ్ చేశారు. నిజమైన ప్రేమ- విధి థీమ్ గా సాగిన ఈ పాటకు అనంత శ్రీ అద్భుతమైన సాహిత్యం అందించారు. అనురాగ్ కులకర్ణి ఈ పాటని ఎనర్జిటిక్ గా ఆలపించారు.
 
సురేష్ బొబ్బిలి, అరుల్‌దేవ్ కలిసి ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఎంఎన్ బాల్ రెడ్డి సినిమాటోగ్రఫీ, జునైద్ సిద్ధిక్ ఎడిటర్. అనంత శ్రీరామ్ సాహిత్యం అందించగా, భాస్కర్ ముదావత్ ప్రొడక్షన్ డిజైనర్.
 
జయసుధ, శరత్‌బాబు కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రంలో వనిత విజయకుమార్, అనన్య నాగెళ్ల, రోషన్, రవివర్మ, అన్నపూర్ణ, భద్రం, యుక్త, ప్రవీణ్ యండమూరి, మధు తదితరులు నటిస్తున్నారు.