సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. ట్రైలర్స్
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 21 ఏప్రియల్ 2023 (16:19 IST)

నా భర్త నరేష్ ఓ మృగం, నా భార్య బిచ్ : మళ్లీ పెళ్లి టీజర్ చెప్పెదిదే (video)

Naresh VK, Pavitra Lokesh
Naresh VK, Pavitra Lokesh
నవరసరాయ డా.నరేష్ వికె పరిశ్రమలో 50 గోల్డెన్ ఇయర్స్ ని పూర్తి చేసుకున్నారు. నరేష్, పవిత్రా లోకేష్ కలసి నటిస్తున్న గోల్డెన్ జూబ్లీ ప్రాజెక్ట్ తెలుగు-కన్నడ ద్విభాషా చిత్రం 'మళ్ళీ పెళ్లి'. కన్నడ టైటిల్ మత్తే మధువే. విలక్షణమైన కథతో పూర్తిస్థాయి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని మెగా మేకర్ ఎమ్‌ఎస్ రాజు రచన, దర్శకత్వం వహించగా, విజయ కృష్ణ మూవీస్ బ్యానర్‌పై నరేష్ స్వయంగా నిర్మిస్తున్నారు.
 
ఫస్ట్ లుక్ పోస్టర్, గ్లింప్స్ తో  మంచి ఇంప్రెషన్ తెచ్చిన మేకర్స్ ఈ రోజు రెండు భాషలలో టీజర్‌ను విడుదల చేశారు. వనిత విజయకుమార్ మీడియాతో మాట్లాడుతూ తాను మోసపోయానని చెప్పడంతో  టీజర్ ప్రారంభమవుతుంది. తన భర్త పాత్ర పోషించిన నరేష్ ని మృగం అని పిలుస్తుంది. వెంటనే ఫోన్ లో నరేష్ మాట్లాడతాడు.. ఊరినిండా అప్పులు, వంటినిండా రోగాలు.. యూ బిచ్ .. అని అంటాడు. రెండవసారి తన ప్రేమను గుర్తించిన నరేష్ , పవిత్ర లోకేష్‌తో సంతోషకరమైన జీవితాన్ని గడపడం కనిపిస్తుంది.
 
ఆస‌క్తిక‌ర‌మైన క‌థ‌ల‌ను ఎంచుకుంటున్న ద‌ర్శకుడు ఎంఎస్ రాజు మ‌రో విభిన్న క‌థాంశంతో తెర‌కెక్కించారు. టీజర్ ఆసక్తికరమైన కథనంతో అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. నరేష్ తన ఎప్పటిలాగే అత్యుత్తమ నటన కనబరిచారు. పవిత్ర లోకేష్ , వనిత వారి వారి పాత్రలకు పర్ఫెక్ట్ ఛాయిస్.