మంగళవారం, 7 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్

పుట్టిన రోజున వేడుకలు.. పేదలకు స్వయంగా భోజనాలు వడ్డించిన చంద్రబాబు

cbnbirthday
టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన పుట్టిన రోజు వేడుకలకు గురువారం జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు పలువురు నేతలు బర్త్ డే విషెస్ చెప్పారు. అలాగే, పలువురు పేదలకు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన స్వయంగా అన్నం వడ్డించారు.
cbnbirthday
 
ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి అనే కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు ప్రస్తుతం ప్రకాశం జిల్లా మార్కాపురంలో పర్యటిస్తున్నారు. ఇక్కడే ఆయన తన పుట్టినరోజు వేడుకలను జరుపుకున్నారు. తాను బస చేసిన ప్రాంతానికి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన చిన్నారులతో కలిసి చంద్రబాబు కేక్ కట్ చేశారు. అలాగే, తన పుట్టిన రోజు సందర్భంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన విందు కార్యక్రమంలో చంద్రబాబు ప్రజలకు స్వయంగా భోజనాలు వడ్డించారు.
cbnbirthday
 
పుట్టినరోజు సందర్భంగా మహిళలతో ఆత్మీయ సదస్సులోనూ చంద్రబాబు పాల్గొన్నారు. వేదికపై ఏర్పాటు చేసిన భారీ కేక్‌ను ఆయన కట్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూటి అనిత, ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ తదితర మహిళా నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఐడియాలజీ కాన్సెప్ట్ నోట్‌ను సామాన్య మహిళలు, చిన్నారులతో కలిసి చంద్రబాబు నాయుడు విడుదల చేశారు.