ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వరుణ్
Last Updated : మంగళవారం, 25 ఏప్రియల్ 2023 (11:09 IST)

వెంటిలేటర్‌పైనే శరత్ బాబు.. డయాలసిస్ చేస్తున్న వైద్యులు

sarath babu
తీవ్ర అనారోగ్యం బారినపడి హైదరాబాద్ నగరంలోని ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సినీ నటుడు శరత్ బాబు ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉంది. ఆయన ప్రస్తుతం సెప్సిస్ అనే వ్యాధితో బాధపడుతున్నట్టు వైద్యులు గుర్తించారు. దీనివల్ల శరీరంలో లోపల ఇన్ఫెక్షన్ సోకి అంతర్గత అవయవాలు పాడైపోయినట్టు వైద్యులు గుర్తించారు. దీంతో ఆయనకు డయాలసిస్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆయనకు వెంటిలేటర్‌పైనే చికిత్స అందిస్తున్నారు. 
 
ఇటీవల అనారోగ్యానికి గురైన శరత్ బాబును బెంగుళూరులోని ఓ ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకున్నారు. అక్కడ నుంచి మెరుగైన వైద్యం కోసం ఆయన కుటంబ సభ్యులు, స్నేహితులు కలిసి హైదరాబాద్ ఏఐజీ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఐసీయూ వార్డులో వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నారు. అయితే, వైద్యులు మాత్రం ఆయన ఆరోగ్యంపై ఎలాంటి సమాచారాన్ని వెల్లడించకుండా రహస్యంగా ఉంచారు. శరత్ బాబు కుటుంబ సభ్యుల వినతి మేరకు వైద్యులు ఎలాంటి హెల్త్ బులిటెన్‌ను విడుదల చేయడం లేదు.