గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 30 జనవరి 2023 (23:02 IST)

తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై హెల్త్ బులిటెన్.. వెంటిలేటర్‌పై..?

TarakRatna
TarakRatna
నారా లోకేష్ పాదయాత్రలో భాగంగా అస్వస్థతకు గురై బెంగళూరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నందమూరి తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై హెల్త్ బులిటెన్ విడుదలైంది. మరింత మెరుగైన వైద్యం కోసం నందమూరి బాలకృష్ణ తారకరత్నను బెంగళూరులోని హృదయాలయ ఆస్పత్రికి తరలించారు. గత మూడు రోజుల పాటు తారకరత్నకు నిపుణులైన వైద్యులు చికిత్స అందిస్తున్నారు. 
 
తాజాగా ఆయన హెల్త్ అప్టేట్‌ని విడుదల చేశారు వైద్యులు. ఇంకా తారకరత్న ఆరోగ్య పరిస్థితి విషమంగానే వుందని... అయితే ఆయనకు ఎక్మో మాత్రం పెట్టలేదని వైద్యులు చెప్పారు. వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నామని చెప్పారు. మరికొంత సమయం గడిచిన తర్వాతే పూర్తి వివరాలు వెల్లడిస్తామంటూ తాజా ప్రెస్ మీట్‌లో ఆస్పత్రి పేర్కొంది.