శుక్రవారం, 3 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 23 జనవరి 2023 (16:01 IST)

'కుందనపు బొమ్మ' నటుడు సుధీర్ వర్మ ఆత్మహత్య

sudheer varma
తెలుగు చిత్రపరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. 'కుందనపు బొమ్మ' చిత్రంలో నటించిన యువ నటుడు సుధీర్ వర్మ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ చిత్రంలో సుధాకర్ కోమాకులతో కలిసి 'వన్ ఆఫ్ ది లీడ్ యాక్టర్‌'గా సుధీర్ వర్మ నటించారు. ఈయన తన వ్యక్తిగత సమస్యలతో వైజాగ్‌లోని తన నివాసంలోనే ఆత్మహత్యకు పాల్పడ్డారు. 
 
'సెకండ్ హ్యాండ్', 'కుందనపు బొమ్మ' వంటి చిత్రాల్లో నటించిన సుధీర్ వర్మ ఆకస్మిక మృతిపట్ల పలువురు సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. సుధీర్ వర్మ ఆత్మకు శాంతి చేకూరాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నారు. సుధీర్ వర్మ అంత్యక్రియల్లో పలువురు సహచర సినీ నటులు పాల్గొననున్నారు.