సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్

వ్యక్తిని చంపేసిన వానరాలు గుంపు... ఎక్కడ?

Monkey
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. కొన్ని కోతుల గుంపు ఓ వ్యక్తిని చంపేశాయి. కోతుల గుంపు కారణంగా మేడపై నుంచి వ్యక్త జారిపడటంతో ప్రాణాలు కోల్పోయాడు. కోతుల దాడి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో ఈ ఘటన జరిగింది. 
 
ఈ విరాలను పరిశీలిస్తే, అలీగఢ్ జిల్లాలోని కొత్వాలి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ఇంటి మేడపై కొందరు చిన్నారులు ఆడుకుంటుండగా వారిపై కోతులు దాడి చేసేందుకు ప్రయత్నించాయి. దీన్ని గమనించిన మజీద్ (50) అనే వ్యక్తి కోతుల దాడి నుంచి చిన్నారులను రక్షించేందుకు ప్రయత్నించాడు. 
 
అయితే, ఆ కోతుల గుంపు మజీద్‌పై దాడి చేసేందుకు ప్రయత్నించగా, ఆ దాడి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో ఆయన మేడపై నుంచి కిందపడ్డాడు. దీంతో తీవ్రంగా గాయపడిన మజీద్‌ను ఆస్పత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ కన్నుమూశాడు.