సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : శనివారం, 14 జనవరి 2023 (18:35 IST)

శవాలకు వాడే కెమికల్‌ను పాలలో కలుపుతున్నారు.. ఎక్కడంటే?

milk
యాదాద్రి జిల్లాలో ఫుడ్ సేఫ్టీ అధికారులు ప్రజలకు షాకిచ్చే విషయాన్ని కనుగొన్నారు. శవాలకు వాడే కెమికల్‌ను పాలలో కలుపుతున్నట్లు కనుగొన్నారు. శవాలను భద్రపరిచేందుకు వాడే రసాయనాలను పాలలో కలుపుతున్నట్లు ఫు్డ్ సేఫ్టీ అధికారులు తెలిపారు. వివరాల్లోకి వెళితే.. యాదాద్రి, బీబీనగర్ మండలం కొండమడుగులో ప్రైవేట్ పాల సేకరణ సెంటర్‌లో పరిశోధన జరపడంతో అసలు నిజం వెలుగులోకి వచ్చింది. 
 
పాలు ఎక్కువ రోజులు నిల్వ వున్నా విరిగిపోకుండా వుండేందుకు ఫార్మాల్డిహైడ్ కెమికల్‌ను వాడుతున్నట్లు పాల సేకరణ సెంటర్ నిర్వాహకుడు అంగీకరించినట్లు అధికారులు తెలిపారు. ఈ పాలను ప్యాక్  చేసి స్థానికంగా విక్రయిస్తూ హైదరాబాద్​లోని హోటల్స్​కు తరలిస్తున్నాడు.  దీంతో కుమార్ యాదవ్​ను పోలీసులు అరెస్ట్​ చేసి కేసులు నమోదు చేశారు. ఈ వ్యవహారంపై దర్యాప్తు కొనసాగుతోంది.